Fathers Death : తండ్రి శవం ముందే పెళ్లి చేసుకున్న కొడుకు.. వీడియో !
ప్రధానాంశాలు:
Fathers Death : తండ్రి శవం ముందే పెళ్లి చేసుకున్న కొడుకు..!
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని కలలు కంటారు. కానీ తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఓ తండ్రికి ఆ కల సాకారం కాకముందే కన్నుమూశాడు. అయితే కొడుకు మాత్రం తండ్రి ఆశీస్సులు కోల్పోకూడదని భావించి, ఆయన మృతదేహం ముందు తన ప్రేయసిని పెళ్లి చేసుకొని అందరిని కదిలించాడు. ఈ ఘటన విరుధాచలం సమీపంలోని కవణై గ్రామంలో చోటుచేసుకుంది.

Fathers Death : తండ్రి శవం ముందే పెళ్లి చేసుకున్న కొడుకు.. వీడియో !
Fathers Death తండ్రి ఆశీస్సుల కోసం ఎవ్వరు చేయని పనిచేసిన కొడుకు
రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సెల్వరాజ్ (63) కుమారుడు అప్పు, విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విజయశాంతి నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అర్ధరాత్రి అప్పు తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో అప్పు తన ప్రేయసిని మృతదేహం ముందు తీసుకువచ్చి, ఆమె మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు.
ఈ పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు హాజరుకాలేకపోయినా, అక్కడ ఉన్న బంధువులు, గ్రామస్తులు ఈ జంటను ఆశీర్వదించారు. అనంతరం సెల్వరాజ్ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భావోద్వేగాన్ని కలిగించగా, పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov
— Thanthi TV (@ThanthiTV) April 18, 2025