Chandrababu Naidu : వైఎస్ జగన్ ఇది నీపనే… వాళ్లని పట్టుకోండి.. !
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : వైఎస్ జగన్ ఇది నీపనే... వాళ్లని పట్టుకోండి.. !
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలు జోరుణ ప్రచారాలు చేస్తూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ ప్రజాగాళం పేరుతో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ప్రజా గళం సభలో భాగంగా ఇటీవల గాజువాక వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇక ఈ ప్రజా గళం సభలో భాగంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విజయవాడలో జగన్ పై జరిగిన రాయిదాడిపై కూడా చంద్రబాబు స్పందించారు.
ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విజయవాడలో మొన్న జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్లపై రోడ్ షో చేశారు. ఆయన చుట్టూ భారీ బందోబస్తు తో పోలీసులు కూడా ఉన్నారు. ఆ సమయంలో పవర్ కట్ అయిందట. మరి ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరి గవర్నమెంట్ అంటూ చంద్రబాబు నిలదీశారు. నీ ప్రభుత్వ హయాంలో పవర్ కట్ ఎలా అయిందో నీకే తెలియకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పై రాయి వేస్తే నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను అంటూ తెలియజేశారు. నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా. ఒకప్పుడు ఇలాగే కోడి కత్తి డ్రామా చేసావు. గొడ్డలి తో సొంత బాబాయిని చంపి ఆ నేరని నాపై నెట్టే ప్రయత్నం చేశావు.

Chandrababu Naidu : వైఎస్ జగన్ ఇది నీపనే… వాళ్లని పట్టుకోండి.. !
కానీ ఇప్పుడు నీ చెల్లె రోడ్డుపైకి వచ్చి బాబాయ్ ని ఎందుకు చంపావు అంటూ అడుగుతుంది. దానికి జగన్ సమాధానం చెప్పాల్సిందిగా చంద్రబాబు కోరారు..ఇక ఇదే సమయంలో చంద్రబాబు మాట్లాడుతుండగా ఓ వ్యక్తి చంద్రబాబు పై రాయి దాడి చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్రమత్తమైన పోలీసులు ఆ దాడిని వెంటనే తిప్పి కొట్టి నిందితుని పట్టుకునే ప్రయత్నం చేశారు కాని అతను దొరక్కుండా పారిపోయాడు. , ఇక ఈ విషయంపై చంద్రబాబు స్పందిస్తూ వాడు కచ్చితంగా వైసీపీ గూండానే అయి ఉంటాడు అంటూ చెప్పుకొచ్చారు. మీరు చేసే రాళ్ల దాడికి నేను భయపడనంటూ సమాధానం ఇచ్చాడు.