Chandrababu : చంద్రబాబును నమ్ముకున్న నాయకుల పరిస్థితి ఏంటి? నాలుగు నెలల్లోనే ఎన్నికలు.. వైసీపీని ఢీకొట్టే సత్తా టీడీపీకి ఉందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : చంద్రబాబును నమ్ముకున్న నాయకుల పరిస్థితి ఏంటి? నాలుగు నెలల్లోనే ఎన్నికలు.. వైసీపీని ఢీకొట్టే సత్తా టీడీపీకి ఉందా?

Chandrababu : తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. ఇక.. ఏపీలో ఎన్నికల సమరం ఆరంభం కానుంది. తిప్పి కొడితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో టీడీపీ పార్టీ యాక్టివ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. గత మూడు నాలుగు నెలల నుంచి టీడీపీ పార్టీ ఇన్ యాక్టివ్ అయిపోయింది. దానికి కారణం.. చంద్రబాబును అరెస్ట్ చేయడం. చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. దీంతో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :6 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో ఎందుకు యాక్టివ్ కావడం లేదు

  •  చంద్రబాబు పుణ్యక్షేత్రాల సందర్శన ఎప్పుడు పూర్తవుతుంది?

  •  నియోజకవర్గ స్థాయి నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదు?

Chandrababu : తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. ఇక.. ఏపీలో ఎన్నికల సమరం ఆరంభం కానుంది. తిప్పి కొడితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో టీడీపీ పార్టీ యాక్టివ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. గత మూడు నాలుగు నెలల నుంచి టీడీపీ పార్టీ ఇన్ యాక్టివ్ అయిపోయింది. దానికి కారణం.. చంద్రబాబును అరెస్ట్ చేయడం. చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. దీంతో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. కానీ.. చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. ఆయన బెయిల్ మీద బయటికి వచ్చి కూడా నెల దాటింది. అయినా కూడా చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో యాక్టివ్ కాలేదు. ఆయన పార్టీని వదిలేసి పుణ్యక్షేత్రాలను తిరుగుతూ ఉన్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు పార్టీని యాక్టివ్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మరోసారి ఓడిపోక తప్పదు.

చంద్రబాబు పార్టీని, క్షేత్రస్థాయిలో క్యాడర్ ను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో నియోజకవర్గ స్థాయి నేతలు అయితే తమకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు టికెట్లు ఎవరికి ఇస్తారు.. అనేదానిపై క్లారిటీ లేదు. కొత్త వాళ్లకు ఇస్తారా? పాత వాళ్లకే ఇస్తారా? ఎవరికి ఇస్తారు అనేదానిపై క్లారిటీ లేదు. దీంతో అసలు ఈ పార్టీలో ఉండాలా? వద్దా.. ఎవరికి ఇస్తారు.. ఎవరికి ఇవ్వరు అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ఈనేపథ్యంలో చాలామంది నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని పార్టీని గాడిన పెట్టాలని.. ఇంకా నాలుగు నెలల సమయమే లేని కారణంగా చంద్రబాబు వెంటనే పార్టీని చక్కదిద్దే పనులు ప్రారంభించాలని అంటున్నారు.

Chandrababu : చంద్రబాబుకు ఈసారి కూడా గెలుస్తామనే నమ్మకం లేదా?

నిజానికి చంద్రబాబు ఇప్పుడు ఏ పనులు అయినా చేయొచ్చు. రాజకీయంగా ఆయన ఏదైనా చేయొచ్చు. సభలు పెట్టొచ్చు.. నాయకులతో మాట్లాడొచ్చు. ర్యాలీలు చేయొచ్చు.. తన పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు కూడా ప్రకటించవచ్చు. కానీ.. చంద్రబాబు అలాంటి పనులేవీ చేయడం లేదు. మరోవైపు వైసీపీ మాత్రం దూకుడుమీదుంది. రెండోసారి కూడా గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతోంది. అలాంటి పరిస్థితుల్లో వైసీపీని టీడీపీ ఓడించేంత సత్తా ఉందా? వైసీపీ ఓడించేలా ప్రణాళికలను చంద్రబాబు ఎందుకు రచించలేకపోతున్నారు అనే విషయం ఏపీ ప్రజలకు మింగుడుపడటం లేదు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది