TDP : బాబు అభ్యర్థులు ఎక్కడ… తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విషయంలో డైల‌మా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : బాబు అభ్యర్థులు ఎక్కడ… తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విషయంలో డైల‌మా..?

 Authored By aruna | The Telugu News | Updated on :16 January 2024,6:10 pm

ప్రధానాంశాలు:

  •  TDP : బాబు అభ్యర్థులు ఎక్కడ... తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విషయంలో డైల‌మా..?

TDP : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన అనేది తీవ్ర చర్చనియాంశంగా మారింది. మరీ ముఖ్యంగా రాయలసీమ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరు అనేది తెలియని పరిస్థితి . ఈ క్రమంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలను అమలుపరుస్తూ చాలా బిజీగా ఉన్నట్లు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పొత్తు కుదిరిన తర్వాత ఆయన చాలానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జైలు నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కాపులు అనే సమీకరణను బ్యాలెన్స్ చేయడానికి శతవిదాల పాటుపడుతున్నారు. ఇక పొత్తులో ఉన్న జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో ఎవరికీ తెలియదు. మరోవైపు కేవలం జనసేనతో పొత్తు కలవడం వలన ప్రయోజనం లేదని ,అందుకే ముద్రగడను కూడా ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను బాగా వాడుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బిజెపిని కూడా దారిలో పెట్టుకోవడానికి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను , ముద్రగడను , బిజెపిని కాంగ్రెస్ ను ,క మ్యూనిస్టులను అలాగే ఎంఐఎం ను ఆపై అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరాన్ని కూడా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో వాడుకోగలరని అర్థం అవుతుంది.

అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ రాయలసీమలో 50 కి పైగా అసెంబ్లీ వర్గాలు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. అంతేకాక పార్టీ క్యారిడర్ కూడా లేకపోవడం గమనార్హం. తిప్పి కొడితే మరో మూడు నెలల సమయం కూడా లేదు ఎన్నికలకు.మరి ఇలాంటి పరిస్థితులలో రాయలసీమలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై స్పష్టత లేకపోవడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది .ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం సాధించాలంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లా చాలా కీలకమైనదని చెప్పాలి. ఇక్కడ కనీసం 10 సీట్లు గెలిచినప్పుడు తెలుగుదేశం అధికారాన్ని సొంతం చేసుకోగలుగుతుంది. ఎందుకంటే 14 సీట్లున్న ఉమ్మడి అనంతపురంలో గత ఎలక్షన్స్ లో 7 లేదా 8 సీట్లును గెలిచినప్పటికీ తెలుగుదేశం అధికారం దక్కించుకోలేకపోయింది. ఈ విధంగా చూసినట్లయితే అనంతపురంలో తెలుగుదేశం పార్టీకి 10 కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పుడే అధికారం దక్కే పరిస్థితి ఉంటుంది.

అలాంటి ఉమ్మడి అనంతపురం జిల్లా పరిస్థితి చూస్తే పది సీట్లు నెగ్గడం మాట పక్కన ఉంచి కనీసం అభ్యర్థులు ఖరారు అయ్యారా అనేది ప్రశ్నగా మారింది. ఇక అనంతపురం జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే చిత్తూరు రెండు ఎంపీ సీట్లకు అభ్యర్థుల విషయం క్లారిటీ లేదు. ఇక ఎమ్మెల్యే సీట్ల విషయానికొస్తే పూతలపట్టు, చిత్తూరు, మదనపల్లి ,నగరి వంటి ప్రాంతాలలో కూడా అభ్యర్థులపై స్పష్టత లేదు. కర్నూల్ విషయంలో అయితే మరింత గందరగోళం ఉందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఆశలన్నీ గోదావరి జిల్లాలు , పవన్ కళ్యాణ్ కాపుల ఓట్ల పైనే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా 14 నియోజకవర్గాలలో సగం చోట్ల ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ లెక్కన చూస్తే చంద్రబాబు నామినేషన్ ముందు రోజు వరకు అభ్యర్థులను బయట పెడతారో లేదో అనిపిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది