TDP MLA Candidates List : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ.. ఊహించని వాళ్లకు టికెట్స్ ఇచ్చిన చంద్రబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP MLA Candidates List : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ.. ఊహించని వాళ్లకు టికెట్స్ ఇచ్చిన చంద్రబాబు

 Authored By kranthi | The Telugu News | Updated on :11 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  ఏపీలో ఎన్నికలకు దగ్గర పడిన సమయం

  •  జనసేనకు కొన్ని స్థానాలు కేటాయించనున్న చంద్రబాబు

  •  త్వరలోనే ఫస్ట్ లిస్టు రెడీ.. ఆ 18 మందికి టికెట్లు ఫిక్స్

TDP MLA Candidates List : ఏపీలో ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఇంకో నాలుగు నెలల్లో ఏపీలో ప్రభుత్వాలే మారిపోయే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఏపీలో ప్రధానంగా పోటీ అంటే.. అధికార వైసీపీ, టీడీపీ పార్టీ మధ్యనే. ఇటీవల జనసేన పార్టీ కూడా బాగానే దూసుకుపోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు.. వైసీపీని ఓడించేందుకు టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకొని జనసేన ఈసారి ఎన్నికల్లో ముందుకు వెళ్లనుంది. అలాగే.. బీజేపీతో కూడా కలిసి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడం తేలికే అని అంతా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో టీడీపీ రెండు అడుగులు ముందుకేసి ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది.

24 ఎన్నికల కోసం టీడీపీ ముందే తమ అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే.. తెలంగాణ రాజకీయాలు చూశాక.. ఏపీలో తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. చంద్రబాబు నిజానికి ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగుపెడతా అన్నారు. అలాగే.. సొంతంగా టీడీపీ పోటీ చేయడం లేదు. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుంటున్నాయి. ఈనేపథ్యంలో జనసేనకు ఎన్ని టికెట్లు ఇస్తారు. హామీలు ఏంటి.. మేనిఫెస్టో ఏంటి.. పవన్ కోరిన స్థానాలు ఏంటి.. అనే దానిపై చంద్రబాబు కూడా క్లారిటీతో ఉన్నారు. జనసేనకు టికెట్లు ఇచ్చే స్థానాల్లో టీడీపీకి ఇవ్వకుండా ఉండేలా.. అక్కడ టీడీపీ నేతలు అసంతృప్తికి లోనవకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

TDP MLA Candidates List : రాబిన్ శర్మ టీమ్ తో సర్వే

అయితే.. ఏ నియోజకవర్గంలో టీడీపీకి మద్దతు ఉంది. ఏ నియోజకవర్గంలో జనసేనకు మద్దతు ఉంది అనే విషయాపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ తీసుకొని త్వరలోనే ఫస్ట్ లిస్టును విడుదల చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్టును విడుదల చేసి.. ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించాలని టీడీపీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు అయితే ఖచ్చితంగా టికెట్ మళ్లీ ఇచ్చే అవకాశం ఉంది. 23 మందిలో 5 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినా.. 18 మంది ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారలేదు. వాళ్లతో పాటు గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు, ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు ప్రకటించేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది