TDP : టీడీపీకి కలిసొస్తున్న పొత్తు .. గతి లేని సీట్లలో అదే దిక్కు..!
ప్రధానాంశాలు:
TDP : టీడీపీకి కలిసొస్తున్న పొత్తు .. గతి లేని సీట్లలో అదే దిక్కు..!
TDP : ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు హోరాహోరి పోటీ నెలకొంది. అధికార పార్టీ వైయస్సార్ సీపీ అధినేత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇక వీరితో బీజేపీ కూడా కలవబోతోంది అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం జనసేన, బీజేపీ లతో కలిసి పోటీ చేస్తే కొన్ని సీట్లు వదులుకోవాల్సి వస్తుంది. అది ఎంత స్థాయిలో వదులుకోవాల్సి ఉంటుందో ఇప్పటికీ క్లారిటీ లేదు. జనసేన విషయంలో అయితే టీడీపీ ఎన్ని సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ అనే పరిస్థితి లేదు. ఇక బీజేపీ ఏంటనేది ఇంకా బయటపడడం లేదు. అటు ఇటుగా 40 అసెంబ్లీ నియోజకవర్గాలు, కనీసం 12 ఎంపీ నియోజకవర్గాలను టీడీపీ తన మిత్రపక్షాలకు కేటాయించి రావాల్సి ఉంటుందని టాక్ నడుస్తుంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని విశ్లేషణ ఉంది.
ఒక క్యాడర్, నిర్మాణం అంటూ లేని జనసేనకు, ఏపీలో చెప్పుకోవడానికి ఏమీ లేని బీజేపీకి 40 సీట్లు ఇస్తే అవి గెలుసుకోస్తాయా లేదా అనే సంగతి పక్కన పెడితే ఎన్నికలకు మరి ఎంతో లేని సమయంలో ఎన్ని త్యాగాలు చేసేందుకు టీడీపీ నేతలు ఎంతమంది ఉంటారు అనేది ప్రశ్న. ప్రచారం చేసుకోవాల్సిన సమయంలో ఈ పొత్తు టీడీపీకి తీవ్రంగా నష్టం చేస్తుందనే మాట వినిపిస్తుంది. అయితే ఈ పొత్తు వలన కొన్నిచోట్ల టీడీపీ గతి లేని తనాన్ని కవర్ చేస్తుంది. సొంతంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడానికి కూడా టీడీపీకి ఇప్పుడు శక్తి లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒకవేళ జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తు లేకపోతే తెలుగుదేశం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేదు. ఎవరో ఒకరైతే అప్పటికప్పుడు నామినేషన్ వేయించవచ్చు.
అయితే టీడీపీకి చెప్పుకోదగిన అభ్యర్థులు నియోజకవర్గాలలో లేరు. ఇన్చార్జ్ లుగా ఎవరో ఒకరి పేరును ప్రకటించేసి ఇన్నాళ్లు ముందుకు నడిపించారు. అలాంటి పేర్లు కూడా లేని నియోజకవర్గాలు కోస్తాంధ్ర , రాయలసీమలో ఉన్నాయి. పలు ఎంపీ సీట్లకు పేర్లను టీడీపీ ఆ స్థానం మీడియా ప్రకటిస్తుంటేనే ఆ పేర్లను వాళ్ళు తమకు ఎంపీ టికెట్ వద్దని అంటున్నారు. టీడీపీ త్యాగం చేసే వాళ్ళ సంగతేమో కానీ ఈ పొత్తు లేకపోతే సొంతంగా 175 చోట్ల అభ్యర్థులను పెట్టడానికి 25 ఎంపీ సీట్లలో అభ్యర్థులను నిలబెట్టడానికి చంద్రబాబుకు కష్టం అవుతుంది. 2009 ఎన్నికలలో కూడా చంద్రబాబు ఇలానే ముప్పు తిప్పలు పడ్డారు. చాలా చోట్ల రాత్రికి రాత్రి చేర్చుకొని కొందరితో నామినేషన్లు వేయించారు. ఆ ప్రభావం ఫలితాల్లో కనిపించి టీడీపీ దెబ్బతినింది. పొత్తు లేకపోతే ఈసారి తెలుగుదేశం కి అభ్యర్థుల కరువు పతాక స్థాయిలో ఉండేది.