TDP : గవర్నర్ పదవిపై టీడీపీ సీనియర్స్ కన్ను వేశారా.. ఈ విషయంలో బీజేపీ మెత్తబడిందా..!
ప్రధానాంశాలు:
TDP : గవర్నర్ పదవిపై టీడీపీ సీనియర్స్ కన్ను వేశారా.. ఈ విషయంలో బీజేపీ మెత్తబడిందా..!
TDP : ఆంధ్రప్రదేశ్‍లో ఐదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగు తమ్ముళ్లు డీలా పడిపోయారు. అయితే చంద్రబాబు సారథ్యంలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన తెలుగుదేశం పార్టీ.. జనసేన, బీజేపీలతో కలిసి అధికారం దక్కించుకుంది. ఇన్నిరోజులు తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నేతల నుంచి కార్యకర్తల వరకూ ఆశిస్తున్నారు. ఇటీవల పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలోనే బూత్ స్థాయి కార్యకర్తల నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వరకూ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
TDP జాతీయ నామినేటెడ్ పోస్ట్‌లపై కన్ను..
త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తానని ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు కట్టబెడతామని నేతలకు హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ విజయం కోసం ఎవరు పనిచేశారనే దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే మూతపడిన అన్నా క్యాంటీన్లను వందరోజుల్లోగా తెరుస్తామని స్పష్టం చేశారు. ఈసారి పలువురు సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కలేదు.. అలాగే కొందరికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా ఇవ్వలేదు. సామాజిక సమీకరణాలు.. జిల్లాలవారీగా లెక్కలతో చంద్రబాబు సీనియర్లు కొందరికి న్యాయం చేయలేకపోయారు. అయితే ఈ క్రమంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.. టీడీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.
సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌లు, పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.. గవర్నర్ పదవి రేసులో టీడీపీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలు ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది.సీనియర్ నేతల్లో ఒకర్ని గవర్నర్‌గా చేసేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్ పదవి రేసులో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయట.తెలుగుదేశం మంత్రివర్గంలో చాలా మంది సీనియర్లకు అవకాశం దక్కలేదు. దీంతో చాలా మంది సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతారని అనుకుంటూ వస్తున్నారు. నిజానికి టీడీపీ సీనియర్ల పాజిటివ్ తీసుకుంటున్నారు. యువతకు అవకాశం ఇవ్వాలి కదా అంటున్నారు. అయితే చంద్రబాబు ఈ సారి ఎక్కువగా కొత్తతరానికి అవకాశం కల్పించారు. అయితే సీనియర్ నేతలకు ప్రత్యామ్నాయ పదవుల ద్వారా ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు.