Janasena – TDP : జనసేన తోడు లేకపోతే .. టీడీపీ కి వచ్చే సీట్లు ఇవే..!
Janasena – TDP : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని 2014 స్థాపించారు. కాగా 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇతర పార్టీలకు మద్దతు తెలిపారు. దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. కాగా ఇప్పటి వరకు పెద్దగా చెప్పుకోదగ్గ నేతలు జనసేనలో లేరనే చెప్పాలి.. పైగా అన్ని నియోజకవర్గాల్లో కనీసం పార్టీ ఇన్ చార్జులు కూడా లేకపోవడం గమన్హరం. అయితే దీనికి కారణం అధినేత పవన్ కల్యాణే కారణమని అంటున్నారు పార్టీ సైనికులు.. కార్యకర్తలు. ఇందుకు ప్రధాన కారణం టీడీపీతో ఉన్న సంబంధాలే అంటున్నారు. ఇక గత ఎన్నికల్లో జనసేన బీజేపీ, టీడీపీ తో కాకుండా సొంతంగా పోటీ చేసింది. పవన్ రెండు చోట్ల పోటీ చేసినా రెండు చోట్లా ఓటమిని చవిచూశారు. ఇక పార్టీ తరఫున రాజోలులో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. మార్పు తీసుకొస్తానని, అణగారిన వర్గాల రాజకీయ అధికార ఆకాంక్షను నెరవేరుస్తానంటే కొంత వరకూ నమ్మారు.2009లో కూడా వైఎస్సార్ నేతృత్వంలో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం చేశారు. చిరంజీవికి రాజ్యసభ పదవి, అనంతరం కేంద్ర మంత్రి అయ్యారు. అయితే అప్పుడు ప్రజారాజ్యం అనుబంధ విభాగం యువరాజ్యానికి పవన్‌కల్యాణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నప్పుడు పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదేంటని అన్నను ప్రశ్నించలేదు. కానీ నేడు విలీనానికి వైఎస్సార్ కోవర్టులే కారణమని విమర్శిస్తున్నారు.
ఇక పవన్ అంతా తానై పార్టీని నడిపిస్తున్నారు.. ఇందులో అన్న చిరంజీవిని ఎక్కడా ఇన్వాల్వ్ చేయడం లేదు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా జగన్‌నే తిట్టడం పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులపై పవన్ ఏనాడూ విమర్శించలేదు. అయితే టీడీపీపై ప్రజావ్యతిరేకతను పసిగట్టి, 2019లో ఆ పార్టీకి పవన్ దూరంగా ఉన్నారు. పనిలో పనిగా ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదని ఆ పార్టీకి కూడా ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు. చివరికి పవన్ నిలిచిన రెండుచోట్ల కూడా ఆయన్ను ఓడించారు. ఇక ఆ తర్వాత పవన్ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు.
Janasena – TDP : కలిసి పోటీ చేస్తే ప్లస్.. మైనస్ లు..
అయితే టీడీపీ ఆహ్వానిస్తే మాత్రం కొన్ని షరతులతో జతకట్టడానికి రెడీగా ఉన్నారు. అధికారం షేరింగ్.. కొన్ని సీట్లు కూడా టీడీపీ త్యాగం చేయాలనే డిమాండ్ కూడా పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే నిలకడ లేని పవన్ నాయత్వం ప్రజల్లో ఓ ఊపు తేలేకపోతోంది. ఇప్పటికీ పవన్ కుదిరితే బీజేపీ.. లేదంటే టీడీపీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. దీంతో టీడీపీ కూడా జనసేనతో కలిసి పోటీ చేస్తే కొన్ని సీట్లను త్యాగం చేయాల్సిన అవసరం ఉందది కాబట్టి పెద్దగా పట్టించుకోవడంలేదు. అయితే జనసేనకు ఏ మాత్రం బలం లేని నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లు కలిసి జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. జనసేన మద్ధతుతో టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో పొత్తుల వల్ల కొందరు టీడీపీ నేతలు నష్టపోతారు..సీట్లు కోల్పోతారు. జనసేనకు ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే జనసేనకు రాష్ట్రంలో పెద్ద బలం లేదు. మొత్తానికి చూసుకుంటే పొత్తు వల్ల జనసేనకు ప్లస్ ఎక్కువ ఉండగా, టీడీపీకి ప్లస్, మైనస్‌లు కూడా ఉన్నాయి.