Tukkuguda Congress Sabha : తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరైన ఈ సభ వేదికగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సభ ప్రసగించిన సోనియా గాంధీ 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించారు. అందులో ఒకటి గృహజ్యోతి. ఈ పథకం ప్రకారం ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందించనున్నారు.

అలాగే రైతు భరోసా కింద భూమి ఉన్న రైతులకు, భూమి లేని కౌలు రైతులకు ప్రతి ఏటీ రూ.15 వేలు అందించనున్నారు. గుంట భూమి కూడా లేని కూలీలకు ప్రతి సంవత్సరం రూ.1 వేలు, రూ.500 బోనస్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇక.. చేయూత కింద రూ.4 వేల పెన్షన్ అందించనున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వనున్నారు.
Tukkuguda Congress Sabha : మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ప్రతి నెల రూ.2500
ఇక.. మహాలక్ష్మీ స్కీమ్ కింద ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.2500తో పాటు రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తారు. ఇక.. ఆరో గ్యారంటీ పథకం కింద.. యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కింద రూ.5 లక్షలు అందించనున్నారు. అలాగే.. తెలంగాణలోని ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభించనున్నారు.