OYO Room : పెళ్లి ముహూర్తం బాగాలేదని చెప్పి OYO రూమ్ కు తీసుకెళ్లి..!
ప్రధానాంశాలు:
OYO Room : పెళ్లి ముహూర్తం బాగాలేదని చెప్పి OYO రూమ్ కు తీసుకెళ్లి..!
OYO Room : ప్రకాశం జిల్లా బట్లపల్లికి చెందిన ఓ మహిళ విడాకుల అనంతరం తల్లి దండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికి ఆమె బంధువైన పెద్దమామ కుమారుడు యద్దనపూడి సుధాకర్ ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ ప్రేమ నాటకం ఆడాడు. పెద్దలు అంగీకరించకపోయినా, తాను నిజంగా ప్రేమిస్తున్నానంటూ ఆమెను నమ్మించాడు. చివరకు పెద్దల సమ్మతంతోనే వివాహం జరుగుతుందని చెప్పి ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు…
OYO Room : పెళ్లి ముహూర్తం బాగాలేదని చెప్పి OYO రూమ్ కు తీసుకెళ్లి..!
OYO Room పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై లైంగిక దాడి చేసిన వ్యక్తి
హైదరాబాద్‌లో ఒక గదిలో మంగళసూత్రం, మెట్టెలు చూపించి “గుడికి వెళదాం, కానీ నేడు మంచి రోజు కాదు” అంటూ మహిళను మోసం చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఒంగోలు తీసుకెళ్లి, ఏప్రిల్ 30న పెళ్లి చేస్తానని బంధువుల ముందు మాటిచ్చి ఆమెను పుట్టింటికి పంపించాడు. కానీ ఆ తర్వాత తన మాట మార్చి, పెళ్లి చేసుకోనని, ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీనితో మోసానికి గురైన బాధిత మహిళ ముండ్లమూరు పోలీసులను ఆశ్రయించింది
. సుధాకర్‌తో పాటు, అతడిని దాచిపెట్టిన తల్లిదండ్రులు, అన్న, మేనమామలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎస్సై కమలాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ పేరుతో మోసం, నమ్మకద్రోహం, లైంగిక దాడుల ఘటనలు పెరిగిపోతున్న వేళ, మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరికగా నిలుస్తోంది.