AP Three Capitals : మూడు రాజధానులకి బైబై అంటున్న వైసీపీ… అమరావతికే జై కొట్టేసిందా…?
ప్రధానాంశాలు:
AP Three Capitals : మూడు రాజధానులకి బైబై అంటున్న వైసీపీ... అమరావతికే జై కొట్టేసిందా...?
AP Three Capitals : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మొన్నటి వరకు వైసీపీ పాలన సాగగా ఏపీ రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది..? నిన్నమొన్నటి వరకు స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లుగా భావించవచ్చు. ఆ సమాధానమే.. అమరావతి. దాదాపు 1632 రోజులుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని స్థానిక గ్రామాల ప్రజలు కొందరు ఉద్యమిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కచ్చితంగా అమరావతికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని అమరావతి పరిరక్షణ ఉద్యమ నాయకురాలు అన్నారు .
AP Three Capitals అమరావతికే ఓటు..!
అమరావతి రాజధాని నిర్మాణానికి 2015 అక్టోబరు 22న శంకుస్థాపన జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది. ఇది తెలుగుదేశంకి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏపీలో మూడు రాజధానులను తెరపైకి తీసుకువరావడం కూడా ఆ పార్టీకి మింగుడుపడకుండా అయింది.
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధానిగా అమరావతి అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని అందరు భావిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తోన్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌వోడీ, రాజ్‌భవన్ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో కూడా అమరావతికి కేంద్రం రూ.15 వేలు ప్రకటించడం మనం చూశాం.అయితే అపురూపంలో అందిందని తెలియడంతో వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రాంట్ రూపంలో విడుదల చేయాలని కోరుతున్నారు. అంటే అమరావతికి వారు ఇన్‌డైరెక్ట్‌గా వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని చెబుతున్నారు.