Today Gold Price : బంగారం కొనేవారికి కాస్త ఊరట.. నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త ధర తగ్గింది..!
ప్రధానాంశాలు:
బంగారం కొనేవారికి కాస్త ఊరట.. నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త ధర తగ్గింది..!
Today Gold Price : బంగారం కొనుగోలుదారులకు ఇది ఒక మంచి వార్త. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నా, ఈరోజు మాత్రం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం ఒక గ్రాముకు రూ. 9,517 గా ఉంది, ఇది నిన్నటి ధర రూ. 9,518 కన్నా రూ. 1 తక్కువ. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి రూ. 87,200 నుండి రూ. 87,190కి తగ్గింది. ఇది వినియోగదారులకు కొంత ఊరట కలిగించే విషయం.

Today Gold Price : బంగారం కొనేవారికి కాస్త ఊరట.. నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త ధర తగ్గింది..!
Today Gold Price ఈరోజు బంగారం ధర తగ్గిందా..? పెరిగిందా..? మీరే చూడండి
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,517 , 10 గ్రాములు (రూ. 95,170) నిన్న 10 గ్రాములు (రూ . 95,180 ) , 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,719 , 10 గ్రాములు (రూ. 87,190 ) నిన్న (రూ .87,200 ) .18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,134. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న ఆర్థిక అస్థిరతలు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి దూస్తున్న సూచనలు, డాలర్ విలువ తగ్గడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు వంటి అంశాలు బంగారంలో పెట్టుబడులను పెంచుతున్నాయి.
ఇదే సమయంలో అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాల ప్రకటనలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సుంకాలు వాయిదా వేయడంతో బంగారం ధరలు కొంత దిగివచ్చాయి. . ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, మొత్తం మీద బంగారం రేట్లు ఇంకా చాలా ఎత్తులోనే కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు తమ డబ్బును సురక్షితంగా నిలుపుకోవడానికి బంగారాన్ని ఎంపిక చేసుకుంటుండటమే ధరల పెరుగుదలకు కారణమవుతోంది.