Today Gold Price : వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..?
ప్రధానాంశాలు:
Today Gold Price : వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..?
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్కరోజే రూ.1650 మేర పెరిగిన బంగారం ధర సామాన్యులను కలవరపెడుతోంది. గత వారం రోజుల్లోనే బంగారం ధరలు రూ.90,000 నుంచి రూ.98,000 మార్క్‌ను తాకడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,100గా ఉంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి రూ.97,650గా ఉండగా, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో అదే బంగారం రూ.97,700కి చేరుకుంది.

Today Gold Price : వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..?
Today Gold Price ఒక్కరోజే రూ.1650 పెరిగిన బంగారం ధర
అంతేకాకుండా, వెండి ధరలు కూడా అదే తరహాలో భారీగా పెరిగాయి. కిలో వెండి ధర ఒక్కరోజులో రూ.1900 మేర పెరిగి రూ.99,400కు చేరింది. బుధువారం కిలో వెండి రూ.97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఔన్సుకు గరిష్ఠంగా 3,318 డాలర్లను తాకగా, ప్రస్తుతం అది 3,296 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, డాలర్ ఇండెక్స్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న ఊహాగానాలు బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణాలు.
ఈరోజు (ఏప్రిల్ 17) ఉదయం 6 గంటలకు ఉన్న ధరలను పరిశీలిస్తే..హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.9,618, 22 క్యారెట్ల బంగారం ధర రూ.8,816, 18 క్యారెట్ల బంగారం ధర రూ.7,214గా నమోదైంది. ఈ స్థాయిలో ధరలు పెరగడం వల్ల సామాన్యులు బంగారం కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.