Today Telugu Breaking News : ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేత.. నాకు మంత్రి పదవి కావాలి అన్న ఉత్తమ్ భార్య పద్మావతి.. డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఫ్రీ బస్.. నాకూ మంత్రి పదవి కావాలన్న రాజగోపాల్ రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Telugu Breaking News : ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేత.. నాకు మంత్రి పదవి కావాలి అన్న ఉత్తమ్ భార్య పద్మావతి.. డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఫ్రీ బస్.. నాకూ మంత్రి పదవి కావాలన్న రాజగోపాల్ రెడ్డి

Today Telugu Breaking News : కాంగ్రెస్ హయాంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009 డిసెంబర్ 9 నుంచి 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీ తాజాగా జిల్లా ఎస్పీలను ఆదేశించారు. నాకు మంత్రిగా పనిచేయాలని కోరిక ఉంది. మహిళా కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నాను. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నాకు మంత్రి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :8 December 2023,9:24 pm

ప్రధానాంశాలు:

  •  రేపటి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం అన్న రాజాసింగ్

  •  పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ

  •  ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు లైన్ క్లియర్

Today Telugu Breaking News : కాంగ్రెస్ హయాంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009 డిసెంబర్ 9 నుంచి 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీ తాజాగా జిల్లా ఎస్పీలను ఆదేశించారు.

నాకు మంత్రిగా పనిచేయాలని కోరిక ఉంది. మహిళా కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నాను. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నాకు మంత్రి అయ్యే అర్హత ఉంది అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి(Uttam Padmavathi) అన్నారు.

తెలంగాణలో మహాలక్ష్మి పథకం(Telangana Mahalaxmi Scheme) కింద తెలంగాణ మహిళలకు డిసెంబర్ 9 నుంచి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) ప్రకటించారు.

మా ఇంట్లో రెండు మంత్రి పదవులు కావాలి. కేసీఆర్ ఇంట్లో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరికి రెండు మంత్రి పదవులు ఇవ్వలేదా? మా ఇంట్లో మా అన్నకు, నాకు ఇద్దరికీ మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు.. అంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(Munugodu MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు.

అక్బరుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ప్రోటెం స్పీకర్ అయితే తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను అని రాజా సింగ్(Raja Singh) అన్నారు.

ప్రగతి భవన్ ప్రారంభం నాటి శిలాఫలకంపై ఉన్న కేసీఆర్(KCR) పేరును మట్టితో కొందరు కాంగ్రస్ కార్యకర్తలు కప్పేశారు.

సెక్రటేరియేట్(Telangana Secretariate) లోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. మొదటి రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత మీడియాను, సందర్శకులను అనుమతించొద్దని పోలీసులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

యశోద ఆసుపత్రి(Yashoda Hospital)లో చికిత్స పొందుతున్న కేసీఆర్(KCR) ను జానారెడ్డి(Janareddy) పరామర్శించారు.

ప్రజా దర్బార్(Praja Darbar) ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) నిర్ణయించారు. జిల్లాకు ఒక టీమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

కేసీఆర్ గాయపడటం బాధాకరం అని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్(AP CM YS Jagan Mohan Reddy) ఫోన్ లో చేసి తెలుసుకున్నారు. కేటీఆర్(KTR) కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది