Today Telugu Breaking News : కరాచీ బేకరీలో పేలుడు.. 15 మందికి తీవ్రగాయాలు.. 150 మంది అభ్యర్థులను మార్చినా జగన్ గెలవడు.. చంద్రబాబు వ్యాఖ్యలు.. ఆసక్తికరంగా మంగళగిరి రాజకీయాలు
ప్రధానాంశాలు:
ఆరు గ్యారెంటీలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా?
తెలంగాణ రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది
ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
Today Telugu Breaking News : హైదరాబాద్ గగన్ పహాడ్ లోని కరాచీ బేకరీ(Karachi Bakery)లో గ్యాస్ సిలిండర్ పేలింది. 15 మంది సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) 150 మంది అభ్యర్థులను మార్చినా గెలవడు. డిపాజిట్లు కూడా రావు. మార్చి తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.
కరీంనగర్ బీజేపీ(Karimnagar BJP)లో విభేదాలు ముదురుతున్నాయి. పెద్దపల్లి ఎంపీ టికెట్(Peddapalli MP Ticket) కూడా సీనియర్లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వల్ల జిల్లాలో పార్టీ బలహీనమైందని సీనియర్లు మండిపడ్డారు.
వైసీపీ మంగళగిరి ఇన్ చార్జ్(YCP Mangalagiri Incharge) గంజి చిరంజీవి(Ganji Chiranjeevi)ని కలవడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) ఇష్టపడలేదు. ఆర్కేను కలవడానికి వెళ్లిన గంజి చిరంజీవిని ఆర్కే కలవలేదు. దీంతో మంగళగిరి రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిట్ చాట్ చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామన్నారు. ప్రజా భవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటామన్నారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమన్నారు. శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామన్నారు.
త్వరలో ఏపీలో ఎన్నికల షెడ్యూల్(AP Elections Schedule) రానున్న నేపథ్యంలో వచ్చే సంవత్సరం మార్చిలో జరగబోయే పది, ఇంటర్ పరీక్షలకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు తీసుకుంటున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ(AP Minister Botsa Satyanarayana) అన్నారు. అందుకే ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహిస్తామన్నారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 18 నుంచి పది పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
అత్యున్నత ప్రమాణాలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్(Kidney Research Centre) పని చేస్తుందని సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) అన్నారు. కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. కిడ్నీ వ్యాధుల కోసం 37 రకాల ఔషధాలను ఉచితంగా అందజేస్తామన్నారు.
తాను ప్రభుత్వాన్ని కూలగొడతానని అనలేదని.. హామీలు ఎలా నెరవేరుస్తారో సీఎం చెప్పాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal BJP MLA Raja singh) అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి వెళ్లారన్నారు. ఆరు గ్యారెంటీలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా అని ప్రశ్నించారు.
ప్రస్తుతం తెలంగాణ రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy). సర్కారును నడిపే సామర్థ్యం కాంగ్రెస్ కు ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు.