Today Top Telugu News : ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో పడుకుంటా అన్న బండ్ల గణేష్.. వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తాజ్ కృష్ణలో 50 రూమ్స్ బుక్ చేసిన కాంగ్రెస్
ప్రధానాంశాలు:
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డే అని అన్న బండ్ల గణేష్
ఏపీలో తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం
కేసీఆర్‌కి "బై బై కేసీఆర్" అంటూ సూట్ కేస్ గిఫ్ట్ పంపిన వైఎస్ షర్మిల
Today Top Telugu News : ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో పడుకుంటా అని బండ్ల గణేష్(Bandla Ganesh) తెలిపారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చూడాలి కాబట్టి నేను వెళ్లి అక్కడే పడుకుంటా. 9న పండుగ మూడ్ వస్తుంది. ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి అక్కడే ఉండి ఏర్పాటు చూస్తా అని బండ్ల గణేష్ అన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డే అని బండ్ల గణేష్ అన్నారు.
తరుముకొస్తున్న తుఫాన్(Cyclone Michaung).. తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం. 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. దీంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ మిచాంగ్ డేంజర్ గా దూసుకొస్తోందని.. తీరం వెంబడి ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసినట్టు వాతావరణ అధికారులు తెలిపారు. నెల్లూరు, మచిలీపట్నం మధ్య గంటకు 80 నుంచి 90 కిమీల వేగంతో గాలులు వీస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. ఈ మీటింగ్ లో ఏఐసీసీ ఇన్ చార్జ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శలు పాల్గొన్నారు. తాజ్ కృష్ణలో కాంగ్రెస్ 50 రూమ్‌లు బుక్ చేసింది. ఎన్నికల ఫలితాలు.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రమే హైదరాబాద్ కి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి జార్జ్ చేరుకున్నారు.
నా మొక్కు రేపటితో తీరుతుంది.. గడ్డం తీసేస్తా.. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తుంది.. అని ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తెలిపారు.
కేసీఆర్(KCR) ను గద్దె దించడం కోసం ఎన్నికల్లో పోటీ చేయకుండానే త్యాగం చేశాను. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది. కేసీఆర్ కు చిన్న గిఫ్ట్ ఇస్తున్నా అంటూ సూట్ కేసు చూపించిన షర్మిల(YS Sharmila). కేసీఆర్ ప్యాకప్ చేసుకోవాలి. మాకు గెలవడం కష్టమేమో కానీ.. ఓడించడం సులువు. కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యంతోనే వైఎస్సార్టీపీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా(Corona). తాజాగా 88 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులతో కేసీఆర్(KCR) మాట్లాడుతున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva Kumar) వెల్లడించారు. తమ అభ్యర్థులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. తమకు సమాచారం అందింది. తమకు పూర్తి మెజారిటీ రాబోతోంది.. అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
లడఖ్(Ladakh) లో భూకంపం.. 3.4 తీవ్రతతో నమోదు
హైదరాబాద్(Hyderabad) లో ఈనెల 6న జరగనున్న తన కొడుకు రాహుల్ పెళ్లికి సీఎ కేసీఆర్(CM KCR) ను ఆహ్వానించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ(Allam Narayana).
ఎదురింటి వాళ్లతో గొడవ జరగడంతో రోడ్డు మధ్యలో ఇంటి యజమాని గోడ కట్టాడు. ఏపీలోని పల్నాడు జిల్లా శావల్యాపురం(Shavalyapuram) మండలం కారుమంచి(Karumanchi) గ్రామానికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్ ఇండ్లు ఎదురెదురుగా ఉన్నాయి. వీళ్ల మధ్య చాలాసార్లు విభేదాలు రావడంతో ఊరి పెద్దల వద్ద కూడా పంచాయితీ జరిగింది. ఆ గొడవలు ఇంకా పెరగడంతో లక్ష్మీనారాయణ ఇంటి ముందు గోడ నిర్మించాడు.