Pithapuram : పిఠాపురంలో లుక‌లుక‌లు..మ‌న‌సులో మాట చెప్పేశాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pithapuram : పిఠాపురంలో లుక‌లుక‌లు..మ‌న‌సులో మాట చెప్పేశాడా..!

Pithapuram : పిఠాపురంలో కీల‌క నేతగా ఉన్న వ‌ర్మ ఈ సారి అక్క‌డ నుండి పోటీ చేసే అవ‌కాశం ద‌క్కించుకోలేదు. చివరి నిముషంలో జరిగిన రాజకీయ సమీకరణలు పొత్తుల ఎత్తులతో వర్మ సీటు చిత్తు అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే వ‌చ్చే సారి అయిన వ‌ర్మ పిఠాపురం నుండి పోటీ చేసి గెల‌వాల‌ని అనుకుంటున్నారు. అయితే ఆ మ‌ధ్య పిఠాపురం వ‌ర్మ‌పై జ‌న‌సేన నాయ‌కులు దాడి చేసిన‌ట్టు […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 October 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Pithapuram : పిఠాపురంలో లుక‌లుక‌లు..మ‌న‌సులో మాట చెప్పేశాడా..!

Pithapuram : పిఠాపురంలో కీల‌క నేతగా ఉన్న వ‌ర్మ ఈ సారి అక్క‌డ నుండి పోటీ చేసే అవ‌కాశం ద‌క్కించుకోలేదు. చివరి నిముషంలో జరిగిన రాజకీయ సమీకరణలు పొత్తుల ఎత్తులతో వర్మ సీటు చిత్తు అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే వ‌చ్చే సారి అయిన వ‌ర్మ పిఠాపురం నుండి పోటీ చేసి గెల‌వాల‌ని అనుకుంటున్నారు. అయితే ఆ మ‌ధ్య పిఠాపురం వ‌ర్మ‌పై జ‌న‌సేన నాయ‌కులు దాడి చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో ఓ కార్యక్రమానికి వర్మ వెళ్లారు. అక్కడ రాళ్లతో దాడి జరగ్గా.. వర్మ సురక్షితంగా బయటపడ్డారు.. అయితే ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. దాడి చేసింది తెలుగు దేశం పార్టీ నుంచి నుంచి జనసేన పార్టీలోకి వెళ్లిన 25మంది చేసిన పని అని వర్మ చెబుతున్నారు.

ప్ర‌స్తుతం పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. కూటమిలో చిచ్చు అక్కడే మొదలైంది అని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గా సీనియర్ నేతగా ఉన్న‌ వర్మకు తగిన గౌరవం దక్కలేదని కూడా ఆయన అనుచరులు మధన పడుతున్నారు. ఇక పవన్ కి ఎమ్మెల్యే సీటు త్యాగం చేస్తే వర్మకు తొలి ఎమ్మెల్సీ పదవి అని నాడు ఇచ్చిన హామీలు ఇపుడు ఏమయ్యాయని కూడా అంటున్న నేపథ్యం ఉంది. ఇటీవ‌ల వ‌ర్మ చంద్ర‌బాబుని క‌లిసి త‌న గోడు చెప్పుకున్న‌ట్టు కూడా టాక్ ఉంది. పిఠాపురంలో జనసేన టీడీపీల మధ్య పొరపొచ్చాలు ఎలా వచ్చాయి అందులో జనసేన నేతల పాత్ర ఎంతవరకూ ఉంది అన్నది ఆయన నిశితంగా వివరించారు అని అంటున్నారు దానిని చక్కదిద్దాలని కూడా ఆయన కోరుతున్నారు అని చెబుతున్నారు.

Pithapuram పిఠాపురంలో లుక‌లుక‌లుమ‌న‌సులో మాట చెప్పేశాడా

Pithapuram : పిఠాపురంలో లుక‌లుక‌లు..మ‌న‌సులో మాట చెప్పేశాడా..!

ప‌లు విష‌యాల గురించి కూడా కూలంకుషంగా వ‌ర్మ‌.. చంద్ర‌బాబుకి వివ‌రించార‌ని దీనిపై చంద్ర‌బాబు ఆలోచించే ప‌నిలో ఉన్నార‌ని అంటున్నారు. హై కమాండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా వర్మకు న్యాయం చేస్తుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా కూటమి సర్కార్ ఏర్పడిన ఆరు నెలల వ్యవధిలోనే పిఠాపురం నుంచే లుకలుకలు మొదలై ఇవి ఇపుడు పెద్దవి కావడం మాత్రం ఏపీ రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది