Venu Swamy : 2024లో జగన్ దెబ్బ మామూలుగా ఉండదు.. ఆ పార్టీ నామరూపం లేకుండా పోతుంది.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు వైరల్
ప్రధానాంశాలు:
ఏపీ రాజకీయాలపై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు నిజమవుతాయా?
వేణు స్వామి చెప్పినట్టుగా ఆ పార్టీ కనుమరుగు కానుందా?
Venu Swamy : 2024 లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి 2024 లో అంటే మేలోనే జరిగేది. అంటే అటూ ఇటుగా చూసుకుంటే వచ్చే 5 నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ రెండు ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. దీంతో ఏపీలో ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే మొదలైంది. ఇంకా 5 నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అధికర వైసీపీతో పాటు.. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అయితే.. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ పార్టీ గెలవదు.. ఎవరు సీఎం అవుతారు అనే విషయంపై ముందే చెప్పేశారు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి. ఆయన పలువురు రాజకీయ నేతల జాతకాలను యూట్యూబ్ లైవ్ లోనే చెప్పేస్తుంటారు. ఈ మధ్య సినీ ప్రముఖులు కూడా ఆయన దగ్గర జాతకాలు చూపించుకుంటున్నారట. అందుకే ఆయనకు ప్రస్తుతం క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి వేణు స్వామి మాట్లాడుతున్నారు. 2024 లో ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏపీలో ఒక పార్టీ కనుమరుగు అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఏపీలో 2024 లో ఒక ప్రధాన పార్టీ కనుమరుగు అవుతుందని స్పష్టం చేశారు వేణు స్వామి. 2024 లో జగన్ వేవ్ కొనసాగుతుందని.. జగన్ దెబ్బకు ఒక పార్టీ మాత్రం ఏపీలో నామరూపం లేకుండా పోతుందని చెప్పారు. ఇంతకీ ఆ పార్టీ ఏంటి.. అనేది నేరుగా చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అన్నట్టుగా చెప్పేశారు వేణు స్వామి. నిజానికి 2024 లో ఎలాగైనా సీఎం కావాలని పవన్ కళ్యాణ్ తెగ కలలు కంటున్నారు. టీడీపీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. ఈనేపథ్యంలో వేణు స్వామి మాత్రం.. అసలు జనసేన పార్టీయే లేకుండా పోతుందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి వేణు స్వామి చెప్పే విషయాలు కొన్ని నిజం అవుతుంటాయి. సమంత, నాగచైతన్య విడిపోతారని వేణు స్వామి ఎప్పుడో చెప్పారు. చంద్రబాబు కూడా 2019 ఎన్నికల్లో ఓడిపోతారన్నారు. అలాగే.. పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయనకు రాజకీయ యోగం లేదన్నారు.
Venu Swamy : పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉండదా?
ప్రస్తుతం ఏపీలో వైసీపీ హవా నడుస్తోంది. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ హవాలో జనసేన, టీడీపీ రెండు పార్టీలు కొట్టుకుపోయాయి. ఈనేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న 2024 ఎన్నికల్లో పెద్దగా ప్రయోజనం ఉండదు అన్నట్టుగా వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఒకవేళ.. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తే మాత్రం అప్పుడు రిజల్ట్ తారుమారు అయ్యే అవకాశం ఉంది కానీ.. ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేయకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో జగన్ వేవ్ కింద జనసేన కనుమరుగు కావాల్సిందే అని స్పష్టం చేశారు వేణు స్వామి.