Vijay Thalapathy : రాజకీయాలలోకి విజయ్ దళపతి.. పార్టీ పేరు ఏంటంటే..??
ప్రధానాంశాలు:
Vijay Thalapathy : రాజకీయాలలోకి విజయ్ దళపతి.. పార్టీ పేరు ఏంటంటే..??
Vijay Thalapathy : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి Vijay Thalapathy రాజకీయ ఎంట్రీ Political Entry గురించి ప్రచారం కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. విజయ్ సొంత పార్టీ పెడుతున్నాడని, 2026 ఎన్నికల బరిలోకి దిగుతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే విజయ్ మాత్రం వీటిపై ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు. దీంతో ప్రచారమా ఇందులో నిజం ఏంటి అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. అయితే తాజాగా వాటన్నిటికీ విజయ్ కొద్దిసేపటి క్రితమే క్లారిటీ ఇచ్చారు. విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి అధికారికంగా ప్రకటించారు. స్వయంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. ‘ తమిళక వెట్రి కజగం ‘ Tamilaga Vettri Kazhagam Party పేరుతో తన నేతృత్వంలో ఒక కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
పీపుల్స్ మూవ్ మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు చేశానన్నారు. కానీ కేవలం స్వచ్ఛంద సంస్థతో పూర్తి సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కరణలను తీసుకురావడం అసాధ్యమని పేర్కొన్నారు. అందుకు రాజకీయ అధికారం కావాలని, అందుకే తాను స్వయంగా పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పాలనాపరమైన దురాచారాలు, అవినీతి రాజకీయ సంస్కృతి, కులమత విభజన వంటి దురాచారాలు పెరిగిపోయాయి అని అన్నారు. వాటికి విరుద్ధంగా ప్రజలు కోరుకునే మౌలికమైన రాజకీయ మార్పుకు నాయకత్వం వహించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ గా ప్రకటించారు.
విజయ్ Vijay Tamilaga Vettri Kazhagam Party దళపతి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం, వరద బాధితులకు సహాయం చేయడం వంటివి విజయ్ స్వయంగా చేయడం రాజకీయ రంగ ప్రవేశానికి సంకేతాలుగా సూచించాయి. ఇప్పుడు దానిని నిజం చేశారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా ప్రేక్షక అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మధురైలో విజయ్ దళపతి ఫోటోలకు అభిమానులు పూజలు చేశారు. మరోచోట ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. కాంచీపురం లో విజయ దళపతి జండాలతో ఊరేగుతూ నినాదాలు చేశారు. మరోచోట బ్యాండ్ మేళంతో ర్యాలీ చేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దళపతి సినిమాలో చేస్తారా ఆపేస్తారా అన్నది చెప్పలేదు.