Vijayashanthi : ఎన్నికలకు ఇంకా 14 రోజులే.. ఈసమయంలో విజయశాంతి షాకింగ్ నిర్ణయం.. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. కారణం అదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vijayashanthi : ఎన్నికలకు ఇంకా 14 రోజులే.. ఈసమయంలో విజయశాంతి షాకింగ్ నిర్ణయం.. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. కారణం అదేనా?

Vijayashanthi : రాములమ్మ తెలుసు కదా. విజయశాంతిని మనం ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటాం. తను సినిమాల్లో ఎంత సంచలనమో అందరికీ తెలుసు. తను సినిమాలో ఉంటే చాలు.. ఆ ఊపే వేరు. కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి. ఆ తర్వాత తను సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్నేళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. టీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసింది. ఆ తర్వాత బీజేపీలో చేరింది. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 November 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  కాంగ్రెస్ లో చేరిక ఖాయమేనా?

  •  ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని బీజేపీకి విజయశాంతి రాజీనామా చేసిందా?

  •  కాంగ్రెస్ నుంచి ఏ పదవి రాబోతోంది

Vijayashanthi : రాములమ్మ తెలుసు కదా. విజయశాంతిని మనం ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటాం. తను సినిమాల్లో ఎంత సంచలనమో అందరికీ తెలుసు. తను సినిమాలో ఉంటే చాలు.. ఆ ఊపే వేరు. కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి. ఆ తర్వాత తను సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్నేళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. టీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసింది. ఆ తర్వాత బీజేపీలో చేరింది. తాజాగా తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 14 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విజయశాంతి కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు విజయశాంతి సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా విజయశాంతి ఉన్న విషయం తెలిసిందే. అయితే.. విజయశాంతి గత కొన్ని రోజుల నుంచి పార్టీలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటో తెలియదు కానీ.. విజయశాంతి బీజేపీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. చివరకు కేంద్ర పెద్దలు ఎవరు తెలంగాణ వచ్చినా.. తను వెళ్లి వాళ్లను కలవలేదు. ప్రధాని మోదీ వచ్చినా కూడా విజయశాంతి వెళ్లలేదు. దీంతో బీజేపీకి రాములమ్మ రాజీనామా చేస్తుందని అంతా భావించారు. అనుకున్నట్టుగానే తను బీజేపీకి రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్టు తెలుస్తోంది. అధిష్ఠానం తీరుపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి.. తన పట్ల పార్టీ ప్రదర్శిస్తున్న వైఖరిపై కూడా ఆమె చిరాకుతో ఉన్నారు. తనకు కనీసం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ లభించలేదు. అలాగే.. ఎంపీ టికెట్ కూడా వస్తుందో రాదో కూడా డౌటే. తనకు బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయశాంతి చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లోనూ విజయశాంతిని పక్కన పెట్టింది అధిష్ఠానం. పార్టీ మార్పుపై విజయశాంతి ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. బీజేపీ తనకు టికెట్ కేటాయించకపోవడం, బీజేపీ రాష్ట్ర నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో విజయశాంతి పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

Vijayashanthi : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, వివేక్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయశాంతి కూడా బీజేపీకి రాజీనామా చేయడంతో పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు విజయశాంతి రెడీ అయినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ.. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి త్వరలో రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది