Bonda Uma – Vangaveeti : సెంట్రల్ సీటు.. టీడీపీలో హాటు.. బోండా ఉమా వర్సెస్ వంగవీటి సైలెంట్ వార్… వీడియో
Bonda Uma – Vangaveeti : ఏపీ రాజకీయాలు రోజురోజుకు కాక రేపుతున్నాయి. దానికి కారణం ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరమే సమయం ఉండటం. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 175 గెలవడం కోసం వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇక. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. వైసీపీలో ఈ నియోజకవర్గం నుంచి ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే.. వైసీపీలో ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు అనేది పెద్ద సమస్య కాదు. కానీ.. టీడీపీ గురించే మనం మాట్లాడుకోవాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ గురించి మాట్లాడుకోవాలంటే
బోండా ఉమ 2019 ఎన్నికల్లో 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇదే నియోజకవర్గం నుంచి నేను కూడా పోటీ చేస్తా అని వంగవీటి రాధా అంటున్నారు. దీంతో టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. నాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తప్పితే మరే నియోజకవర్గం వద్దు. నేను ఏ నియోజకవర్గంలో పోటీ చేయను అని మంకుపట్టు పట్టి కూర్చున్నారట వంగవీటి రాధ. మరి.. వంగవీటి రాధకు ఒకవేళ విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వకపోతే ఎలా? ఆయన టీడీపీని వదిలేసి జనసేన వైపు చూస్తారా? అనేది తెలియదు. కానీ.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీదనే ఎందుకు రాధ అంత పట్టు పట్టారు
Bonda Uma – Vangaveeti : విజయవాడ సెంట్రల్ రాధాకు ఇవ్వకపోతే ఎలా?
అంటే వంగవీటి ఫ్యామిలీ మొదటి నుంచి విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేశారు. మోహన రంగ కూడా ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈస్ట్ లో వంగవీటికి బాగా పట్టుంది కానీ.. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఈస్ట్ లో ఉన్న 40 శాతం ప్రాంతం సెంట్రల్ లో కలిసిపోయింది. దీంతో 2009 లో ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగవీటి రాధా పోటీ చేశారు కానీ.. చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. 2014లో ఈస్ట్ నుంచి పోటీ చేశారు కానీ.. 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈస్ట్ లో ఉన్న తన అభిమానులు, అనుచర వర్గం ఎక్కువగా ఈస్ట్ నుంచి సెంట్రల్ కు తరలింది అని తెలుసుకొని అందుకే వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారట.