Mahasena Rajesh : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్
ప్రధానాంశాలు:
Mahasena Rajesh : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్
Mahasena Rajesh : పాస్టర్ ప్రవీణ్ పగడాల Pastor Praveen Pagadala మృతి కేసు రోజు రోజుకు అనేక అనుమానాలు పెంచుతుంది. ఈ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తాజాగా టీడీపీ నేత మహాసేన రాజేష్ Mahasena Rajesh తీవ్ర స్థాయిలో విమర్శించారు. సంఘటన జరిగిన స్థలాన్ని పోలీసులు సరిగా చూడలేదని, క్రైమ్ సీన్‌ను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో అనుమానాస్పద విషయాలన్నింటినీ తగిన రీతిలో పరిశీలించి నిజాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని మహాసేన రాజేష్ అన్నారు.

Mahasena Rajesh : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్
Mahasena Rajesh పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై లోకేష్ కు తప్పుడు సమాచారం – మహాసేన రాజేష్
ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా విచారణ చేస్తున్నామని చెబుతూనే, మరికొందరు అధికారులు మంత్రి నారా లోకేష్‌కు ఇది హత్య కాదని, ప్రమాదవశాత్తూ జరిగిన మరణమని సమాచారం అందించారని మహాసేన రాజేష్ ఆరోపించారు. ఇది ఎంతవరకు సమంజసమో పోలీస్ శాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సమయంలో, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు లోకేష్‌కు తప్పుదారి పట్టించే సమాచారం అందించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రవీణ్ మృతిపై టీడీపీ ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తం చేస్తోంది. తాజాగా మహాసేన రాజేష్ ఈ అంశంపై మరింత దృష్టి పెట్టి విచారణలో సమగ్రత లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసులు ఈ కేసులో డబుల్ గేమ్ ఆడుతున్నారని, నిజాలను దాచి పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు సాయంత్రం లోపు ఈ కేసుకు సంబంధించి అన్ని నిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
పోలీసులపై టీడీపీ నేత మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు
ప్రవీణ్ పగడాల మృతి విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యం చేశారు
ఘటన జరిగిన దగ్గర ఆ క్రైమ్ సీన్ ని పోలీసులు ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు ?
ప్రవీణ్ ది హత్య కాదు ఆక్సిడెంట్ అని కొందరు పోలీసులు మంత్రి నారా లోకేష్ కి సమాచారం ఇచ్చారు
— BIG TV Breaking News (@bigtvtelugu) March 28, 2025