Telangana Assembly Election 2023 : తెలంగాణలో మీకు ఓటు ఉందా? నవంబర్ 30న ఓటు వేసేముందు ఒక్కసారి ఇది చదవండి..!
Telangana Assembly Election 2023 : తెలంగాణ Telangana లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసిలో అన్ని పార్టీలు ఉన్నాయి. ప్రధానంగా ఈసారి పోటీ అధికార బీఆర్ఎస్ BRS Party , కాంగ్రెస్ Congress Party మధ్యనే ఉంది. అయితే.. అసలు ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎవరిని గెలిపించాలని అనుకుంటున్నారు. ఎవరి వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు అనేది కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. కానీ.. […]
ప్రధానాంశాలు:
బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకుందా?
బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఏంటి?
ప్రజలను ఆకట్టుకుంటున్న కాంగ్రెస్ మేనిఫెస్టో
Telangana Assembly Election 2023 : తెలంగాణ Telangana లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసిలో అన్ని పార్టీలు ఉన్నాయి. ప్రధానంగా ఈసారి పోటీ అధికార బీఆర్ఎస్ BRS Party , కాంగ్రెస్ Congress Party మధ్యనే ఉంది. అయితే.. అసలు ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎవరిని గెలిపించాలని అనుకుంటున్నారు. ఎవరి వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు అనేది కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. కానీ.. పలు సర్వేలు మాత్రం ఒకసారి కాంగ్రెస్ కి, మరికొన్ని సర్వేలు బీఆర్ఎస్ కి అధికారం వస్తుందని చెబుతున్నాయి. సర్వేలను నూటికి నూరు శాతం నమ్మలేం కానీ.. అసలు తెలంగాణ ప్రజలు ఓటు వేసే ముందు అసలు తెలంగాణలో ఏం జరుగుతోందో? ఎంత వరకు అభివృద్ధి జరిగిందో మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయమే ఉంది కానీ.. ఇప్పటి వరకు పార్టీలు ఓటరు నాడీని మాత్రం పసిగట్టలేకపోతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఆలోచించి మరీ మేనిఫెస్టోలను తయారు చేశాయి పార్టీలు.
తెలంగాణలో టాప్ మోస్ట్ స్కీమ్ అంటే రైతు బంధు అనే చెప్పుకోవాలి. ఈ పథకాన్ని ప్రారంభించింది సీఎం కేసీఆర్ KCR. ఇప్పుడు 10 వేలు ఇస్తున్నారు. మళ్లీ గెలిపిస్తే ఎకరానికి 16 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. కానీ.. అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎకరానికి 15 వేలు ఇస్తామని చెప్పారు. అంతే కాదు.. వ్యవసాయ కూలీలకు కూడా 12 వేలు, వరిపంటకు కింటాకు 15 వేలు ఇస్తామని కూడా ప్రకటించింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో ఇదే టాప్ స్కీమ్. ఇక బీజేపీ BJP అయితే రైతును రాజును చేస్తామని ప్రకటించింది. మద్దతు ధరను రూ.3100 కు, విత్తనాల కోసం 2500 ఇన్ పుట్ సబ్సిడీ, మహిళా రైతులకు కార్పొరేషన్, రైతులకు ఆవులు, వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్లు ఇస్తామని వేర్వేరుగా వరాలను ప్రకటించింది బీజేపీ. ఇక కరెంట్ విషయానికి వస్తే ఇప్పటికే తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ సిలిండర్ రూ.500 కి ఇస్తామని చెబితే.. బీఆర్ఎస్ రూ.400 కే సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. బీజేపీ మాత్రం ఉజ్వల పథకంలో ఉన్నవారికి 4 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని తెలిపింది. ఇక.. పెన్షన్ల విషయానికి వస్తే ఏటా 500 కు పెంచి 5 ఏళ్ల తర్వాత రూ.6 వేలకు చేస్తామని బీఆర్ఎస్ వాగ్దానం చేసింది. దివ్యాంగులకు ఏటా రూ.6 వేల వరకు పెంచుతామని బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే.. కాంగ్రెస్ రూ.4 వేలకు పెన్షన్ పెంచుతామని చెప్పింది. బీజేపీ డైరెక్ట్ గా కాకుండా.. వేర్వేరుగా స్కీమ్ లను ప్రకటించింది.
Telangana Assembly Election 2023 : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అని కాంగ్రెస్ ప్రకటించగా… బీఆర్ఎస్ రాయితీలు ఇస్తామని చెప్పింది. కానీ.. బీజేపీ ఇలాంటి పథకాన్ని ప్రకటించలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మేనిఫెస్టోలతో బీజేపీ మేనిఫెస్టోను పోటీగా చూడటం కుదరదు. కానీ.. ఆకర్షణీయమైన పథకాలు మాత్రం బీజేపీ మేనిఫెస్టోలో లేవు. అయితే.. పేద మహిళలకు నెల నెలా రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెబితే అధికార బీఆర్ఎస్ రూ.3 వేలు ఇస్తామని ప్రకటించింది. డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ చెప్పింది. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఉద్యమకారులకు 200 గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద కాంగ్రెస్ 10 లక్షలకు ప్రకటించగా.. బీఆర్ఎస్ కూడా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు బీఆర్ఎస్ సన్నబియ్యం ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ కూడా అదే వాగ్దానం చేసింది. ప్రస్తుతం ఉన్న పథకాలు అన్నీ కంటిన్యూ చేస్తామని ప్రకటించింది బీఆర్ఎస్.
అయితే.. కాంగ్రెస్ ముందే 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించడంతో.. వాటికి ఏమాత్రం తీసిపోకుండా పథకాలను ప్రకటించింది. 6 గ్యారెంటీ పథకాలతో పాటు పలు ఇతర సంక్షేమ పథకాలను కూడా కాంగ్రెస్ ప్రకటించింది. అమరవీరులకు నెల నెలా రూ.25 వేల గౌరవ పెన్షన్, ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే వరకు నెలకు రూ.4 వేల భృతి, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పునరుద్ధరిస్తామని చెప్పింది. 18 ఏళ్లు నిండిన యువకులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12 వేల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది.
గ్రామ పంచాయతీలకు ఏటా 25 లక్షలు అభివృద్ధికి కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. విద్య జ్యోతి పథకం కింద ఎస్సీ, ఎస్టీలు పది పాస్ అయితే 10 వేలు, ఇంటర్ పాస్ అయితే 15 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే 25 వేలు, పీజీ పూర్తి చేస్తే రూ. 1,00,000, పీహెచ్‌డీ, ఎంఫిల్ పూర్తి చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇవే కాకుండా ఇతర మతాలు, కులస్తులకు కూడా పలు స్కీమ్స్ ను ప్రకటించింది కాంగ్రెస్.
బీజేపీ మేనిఫెస్టోలో మహిళలకు 10 లక్షలు ఉద్యోగాలు, యూపీఎస్సీ తరహా ఉద్యోగాలు, 10 లక్షల ఆరోగ్య బీమా, ఆడబిడ్డ భరోసా కింద 2 లక్షలు, పేదలకు ఇండ్ల స్థలాలు, రైతులకు ఉచితంగా పంట బీమా, వృద్ధులకు కాశీ, అయోధ్య టూర్, మేడారం జాతరకు జాతీయ గుర్తింపు, ఎస్సీ వర్గీకరణ, నిజాం షూగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ లాంటి పథకాలతో బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది.
బీఆర్ఎస్, బీజేపీ మేనిఫెస్టోలు కాంగ్రెస్ హామీలతో ఢీకొట్టలేకపోతున్నాయి. అసలు కాంగ్రెస్ నిజంగా గెలిస్తే ఇవన్నీ హామీలు అమలు చేస్తుందా అనేది తెలియదు కానీ.. ఓటర్లను మాత్రం కాంగ్రెస్ మేనిఫెస్టో మాత్రమే ఆకట్టుకుంటోంది. ఓటర్లు మాత్రం ఎటు వైపు మొగ్గు చూపుతారో తెలవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.