Manipur : పూర్తి విశ్లేషణ.. మణిపూర్ లో అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ??
Manipur : మణిపూర్ రాష్ట్రంలో రిజర్వేషన్ ల విషయంలో హింసాత్మక ఘటనలతో రాష్ట్రం అట్టడుకుతున్న సంగతి తెలిసిందే. గిరిజనేతరులైన మైత్రి వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ ఇటీవల న్యాయస్థానం తీర్పు ఇవ్వటంతో మణిపూర్ లో స్థానికంగా ఎస్టీ హోదా అనుభవిస్తున్న గిరిజన సంఘాలు నిరసనలకు దిగాయి. దీంతో ప్రార్థన స్థలాలపై వాహనాలపై దాడులకు తెగబడటం జరిగింది. మణిపూర్ హింసాత్మక ఘటనల వెనుక 54 మంది మృతి చెందినట్లు 100కు పైగా గాయాలు పాలైనట్టు లెక్కలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో జాతి హింసను అణిచివేయడానికి భారత సైన్యం పిలుపునివ్వడంతో.. అస్సాం రైఫిల్స్ 23,000 మందికి పైగా పౌరులను రక్షించి వారిని ఆపరేటింగ్ బేస్ లు, మిలటరీ స్థావరాలకు తరలించినట్లు సైన్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేయడం జరిగింది. రెస్టు ఆపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని… కర్ఫ్యూ వేళలను ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు సడలించడం జరిగింది.
అన్ని వర్గాలలో పౌరులను రక్షించడానికి అరికట్టడానికి మరియు సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి గత నాలుగు రోజులుగా భారత సైన్యం తో పాటు అస్సాం రైఫిల్స్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. హింస తగ్గిపోయింది కర్ఫ్యూ… సడలించడం జరిగింది. ఇంఫాల్ లోయలో ఆధిపత్య కమ్యూనిటీ మైతిస్ కి కూడా ఎస్టీ హోదా రిజర్వేషన్ కల్పించడంతో స్థానికంగా ఎస్టీ హోదా అనుభవిస్తున్న.. గిరిజనులు వ్యతిరేకించడంతో.. అల్లర్లు స్టార్ట్ అయ్యాయి. నిరసనలు హింసాత్మకంగా మారటంతో భారత సైన్యం రంగంలోకి దిగి అదుపు చేయడం జరిగింది.
