Wife Husband : భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం .. తట్టుకోలేక భార్య..!
ప్రధానాంశాలు:
ట్రాన్స్‌జెండర్ తో ఏకాంతంగా గడుపుతున్న భర్తను పట్టుకున్న భార్య
Wife Husband : భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం .. తట్టుకోలేక భార్య..!
Wife Husband : జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్‌కు చెందిన బింగి రాజశేఖర్ తన భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్ వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో రాజశేఖర్‌కు వివాహం జరగగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే రాజశేఖర్ ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ దీప్‌తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నట్లు తెలిసింది. దీంతో జీవితం మీద విరక్తి చెందిన భార్య లాస్య తీవ్ర ఆవేదనతో రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Wife Husband : భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం .. తట్టుకోలేక భార్య..!
Wife Husband : భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం
ఆత్మహత్యాయత్నం చేసుకున్న భార్యను రాజశేఖర్ కనీసం ఆసుపత్రికి వెళ్లి చూసేందుకు రావకపోవడంతో లాస్య కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఎట్టకేలకు రాజశేఖర్ భీష్మనగర్‌లో ట్రాన్స్‌జెండర్ దీప్‌తో కలిసి ఉన్నట్లు తెలుసుకొని, వారిద్దరిని ఒక గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసిన స్థానికులు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
తదుపరి పోలీసు చర్యల్లో భాగంగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాన్స్‌జెండర్ దీప్, రాజశేఖర్‌లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టి ఇలా అనైతిక సంబంధం కొనసాగించడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.