Ponnuru Mission 2024 : పొన్నూరు మళ్లీ టీడీపీ కంచుకోట అవుతుందా ..??
Ponnuru Mission 2024 : పొన్నూరు అనగానే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గుర్తొస్తారు. ఆయన తండ్రి వీరయ్య చౌదరి ఒకప్పుడు పొన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. 1994లో వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆయన వారసత్వంగా నరేంద్ర కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు నుంచి ఆయన 2019 వరకు పొన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరించేవారు. అలా ఆయనకు ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నియోజకవర్గంలో పొన్నూరు కూడా ఒకటి. వైసీపీ పోరును తట్టుకొని మళ్లీ టీడీపీలో నెగ్గాలని నరేంద్ర కుమార్ ప్రయత్నిస్తున్నారు. పొన్నూరులో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదటి నుంచి జరుగుతుంది.
పార్టీ ఏర్పాటైన నాటి నుంచి రావి వెంకటరమణ అప్పట్లో జగన్ తో పాటే ఉంటూ పార్టీ నియోజకవర్గంలో ముందుకు నడిపించారు. అయితే 2018లో పీకే సర్వేల ఆధారంగా జగన్ సీట్లను కేటాయించారు. ఆ క్రమంలో రావి వెంకటరమణను పక్కన పెట్టి అప్పటికప్పుడు వచ్చిన కిలారి రోషయ్యకు సీటు కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. పార్టీ తరఫున కిలారి రోశయ్య విజయం సాధించారు. అయితే రోశయ్య అవినీతి పాలన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా వైసీపీలో ఒక వర్గం పని చేయటం మొదలు పెట్టింది. దీంతో నరేంద్ర కుమార్ రోశయ్యను టార్గెట్ చేశారు. మట్టి తరలించే పనిలో అక్రమాలు జరుగుతున్నాయని అక్కడికి వెళ్లి ట్రాక్టర్లను, జేసీబీలను అడ్డుకొని కిలారి పై ఆరోపణలు చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మట్టి మాఫియా అంశం రావి వర్గం ద్వారానే తెరమీదకు తెచ్చి ఎమ్మెల్యే కిలారి రోశయ్య పై అసత్య ప్రచారం చేశారంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి.
అయితే వై.యస్.జగన్మోహన్ రెడ్డి విడిగా ఒక నివేదికను తెప్పించడంతో రోశయ్య బాగోతం బయటపడింది. మరోపక్క దూళిపాళ్ల నరేంద్రను ఇబ్బంది పెట్టేందుకు ఆయన చైర్మన్ గా ఉన్న సంఘం డైరీ ని టార్గెట్ చేశారు. ఆ విషయంలో నరేంద్ర అరెస్ట్ కూడా జరిగింది. చివరికి నరేంద్ర హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. నరేంద్ర పై వైసీపీ హత్యాయత్న కేసు పెట్టడంతో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కార్యకర్తలు అంతా నరేంద్ర కుమార్ ని గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం కిలారి రోశయ్య ప్లేస్ లో వేరొకరిని పెట్టాలని చూస్తుంది. ఇక ఇప్పుడు జనసేన పొత్తు కూడా ఉండడంతో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పొన్నూరులో కచ్చితంగా గెలుస్తారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.