YS Jagan : చంద్రబాబు , పవన్ కళ్యాణ్ మాకు వద్దు .. జగనన్న సీఎం గా ఉండాలి.. ఓ మహిళ ఎమోషనల్ కామెంట్స్ ..
YS Jagan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి తన పథకాలతో జనాలను ఆకర్షించుకుంటున్నారు.ఇప్పటికే అమ్మ ఒడి, విద్యా దీవెన పథకాల నిధులను విడుదల చేశారు.తాజాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి 8వ విడతగా జగనన్న తోడు పథకం కు గురువారం శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే ఓ మహిళ వై.యస్.జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. జగనన్న తోడు పథకం తమ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో అండగా నిలిచిందని ఎమోషనల్ గా చెప్పారు. తోపుడు బండిమీద పండ్లు అమ్ముకునే ఆ మహిళ జగనన్న తోడు పథకం వలన తనకు ఎంతో లబ్ధి చేకూరిందని, వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్నానని వై.యస్.జగన్మోహన్ రెడ్డి తో చెప్పుకున్నారు.
జగనన్న తోడు వలన తాను ఇప్పుడు షాప్ ఓనర్ గా మారానని ఇదంతా జగనన్న దయ అని ఆమె ఎమోషనల్ అయ్యారు. గత ప్రభుత్వం డ్వాక్రాలు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో డబ్బులు కట్టడం మానేశానని, ఆ సమయంలో వడ్డీ పెరిగిందని, వస్తువులు తాకట్టు పెట్టుకొని వడ్డీ కట్టానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా కట్టిన తర్వాత మూడు నెలలకు లోన్ ఇచ్చారు. గత ప్రభుత్వం మమ్మల్ని చాలా మోసం చేసిందని ఆమె అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నా జీవితం మారిందని ఆమె చెప్పుకొచ్చారు. మాకు వేరే సీఎం వద్దన్న మీరే కావాలి అని ఆమె చేతులెత్తి దండం పెట్టారు. నా కూతురు పదవ తరగతి చదువుతుందని, ప్రభుత్వ పాఠశాలలో చదువు మంచిగా చెబుతున్నారని, మాలాంటి పేద వాళ్లకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు జగనన్నకు థాంక్స్ అని ఆమె అన్నారు.
ఇకపోతే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదలైన చిరు వ్యాపారులు హస్త కళాకారులు సాంప్రదాయ చేతివృత్తుల వారు వారి కాళ్ళ మీద వారు నిలదొక్కుకునేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూతనిస్తున్నారు ఒక్కొక్కరికి వేట పదివేల రుణం సున్నా వడ్డీకి అందిస్తున్నారు రుణాలను సకాలంలో చెల్లించిన వారికి సంవత్సరానికి 1000 చొప్పున జోడిస్తూ 13 వేల వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఏడు విడతల రుణాలు వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతా ఖాతాలో జమ చేశారు 8వ విడతగా గురువారం 417.94 కోట్ల రుణంతో కలిసి ఇప్పటివరకు చిరు వ్యాపారులు చేసుకుని 16 73 576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు 3373.73 కోట్లు.