YCP MLAs : బెంగళూరులో వైసీపీ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ .. టీడీపీలోకి వెళ్ళేది వీళ్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP MLAs : బెంగళూరులో వైసీపీ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ .. టీడీపీలోకి వెళ్ళేది వీళ్లే…!

 Authored By anusha | The Telugu News | Updated on :20 December 2023,6:19 pm

ప్రధానాంశాలు:

  •  YCP MLAs : బెంగళూరులో వైసీపీ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ .. టీడీపీలోకి వెళ్ళేది వీళ్లే...!

YCP MLAs : రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా వైసీపీకి వ్యతిరేకత అయిన ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ పెట్టారంటూ టీడీపీ వర్గాలలో ఒక వార్త హల్ చల్ అవుతుంది. రానున్న 2024 ఎన్నికల్లో దాదాపు వై.యస్.జగన్మోహన్ రెడ్డికి 50 నుంచి 80 టికెట్లు సిట్టింగ్లకు ఇచ్చే ఛాన్స్ లేదని, ఇప్పటికే 11 చోట్ల టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి మీటింగులు చేస్తున్నారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే లు జగన్ ను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేరు ఇవ్వకపోతే తాము ఎలాంటి బేరసారాలు అడగలమో,

రేపు అధికారంలోకి వచ్చాక వాళ్లకు ఎటువంటి హామీ ఇవ్వగలుగుతాం అనే దానిమీద మాట్లాడుతున్నారు. అయితే ఒక పక్క జగన్ తన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతూ ఉండగానే బెంగళూరులో ఒక వర్గం ఇప్పటికే 40 నుంచి 50 ఎమ్మెల్యేలు అక్కడ మీటింగ్ పెట్టుకుని వీళ్లంతా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నారని, టీడీపీ ఎక్కడెక్కడ టికెట్లు ఇస్తుంది అనేదాన్ని మీద క్లారిటీ ఉన్నవాళ్లు అధికారంలేకి టీడీపీనే రాబోతుందని, అందుకే టిడిపిలోకి వెళితే బెటర్ గా ఉంటుంది అని, అధికారం ఉంటే సరిపోతుంది అని, ఒకవేళ వైసీపీలోనే ఉండి ఉంటే వైసీపీ ఓడిపోతే అటు సిట్టింగ్ ఎమ్మెల్యే కోల్పోయినట్లు అవుతుంది. అధికారంలోకి రాకపోతే గతంలో ఉన్న ఇల్లీగల్ కేసులు, తలనొప్పులు స్టార్ట్ అవుతాయని అనే కంగారులో రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారని,

వీళ్లంతా మీటింగ్ పెట్టుకొని ఉన్నారని, టిడిపికి సంబంధించిన పాజిటివ్ మీడియా దీని గురించి న్యూస్ వైరల్ చేస్తుంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఒకవేళ వై.యస్.జగన్మోహన్ రెడ్డి 80 సిట్టింగ్ సీట్లు తీసేస్తే జరగబోయేది ఇదే అని అంటున్నారు. ఒక్కరు ఇద్దరినీ ఆపగలం 88 మందిని తీసేస్తే అది సహజంగా మారిపోతుంది. మారిన వాళ్లు సైలెంట్ గా ఉండరు వైసీపీకి ఓటు వేసిన వాళ్లంతా ఇప్పుడు టిడిపికి ఓటు వేయిస్తారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న లోసుగుల గురించి మాట్లాడుతారు. రాయలసీమకు చెందిన మంత్రి వైసిపి కి చెందిన ఎమ్మెల్యే ఈ మీటింగ్లో కీలక పాత్ర పోషించారంటూ వార్తలు వస్తున్నాయి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది