MP Avinash Reddy : సుప్రీం కోర్టులో బిగ్ సంఘటన – అవినాష్ రెడ్డి విషయంలో భారీ ట్విస్ట్ ఇచ్చిన సిబిఐ పెద్దలు !
MP Avinash Reddy : అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎటువైపు వెళ్తోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అవును.. ఏపీ నుంచి ఈకేసు కాస్త తెలంగాణకు షిఫ్ట్ అయింది. చివరకు సుప్రీంకి చేరుకుంది. సీబీఐ కూడా ఈ కేసును ఎంత త్వరగా ముగించేయాలని చూస్తోంది. సుప్రీంకోర్టు కూడా ఈ నెలాఖరు కల్లా వివేకానంద హత్య కేసు విచారణను ముగించేయాలని చెప్పడంతో… మరోసారి విచారణకు రావాలని కడప ఎంపీ అవినాష్ కి సీబీఐ నోటీసులు పంపింది.
దీంతో అవినాష్ ఆ విచారణకు హాజరయ్యారు. ఆయన దగ్గర్నుంచి కీలక సమాచారంతో పాటు పలు డాక్యుమెంట్లను కూడా సీబీఐ సేకరించింది. మరోవైపు అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ వివేకా కూతురు సునీ సుప్రీంలో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే.. ఎంపీ అవినాష్ కు ముందస్తు బెయిల్ ను తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. కానీ.. కొన్ని షరతులను కోర్టు విధించింది. జున్ నెల మొత్తంలో ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సీబీఐ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
MP Avinash Reddy : నాలుగోసారి సీబీఐ విచారణకు హాజరయిన అవినాష్
సీబీఐ విచారణకు నాలుగుసార్లు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. హైకోర్టు చెప్పినట్టుగా ప్రతి శనివారం అవినాష్ రెడ్డి హాజరు అవుతున్నా.. మళ్లీ ఆదివారం కూడా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే.. ఆదివారం విచారణలో అవినాష్ బ్యాంకు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే.. అసలు అవినాష్ కు ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు.. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తే ఎలా అంటూ వైఎస్ సునీత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.