YS Jagan : తప్పు తెలుసుకొని వ్యూహం మార్చిన జగన్.. ప్రజారాజ్యం భయంలో బాబు.. ఢిల్లీ నుంచి చక్రం తిప్పబోతున్న పవన్ కళ్యాణ్
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికలే మళ్లీ రిపీట్ అవుతాయని అనుకున్నారా? 2024 లో ఎలాగైనా మళ్లీ వైసీపీ గెలుస్తుందని భావించారా? అందుకే ఆయనకు కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలిసిపోయింది. దీంతో వెంటనే రూట్ మార్చేశారు సీఎం జగన్. ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు ఆ మధ్య. దీంతో కొందరు ఎమ్మెల్యేలకు బాగానే క్లాస్ పీకారు వైఎస్ జగన్. కొందరు సిట్టింగ్ లకు టికెట్ ఇవ్వను అని నేరుగా ఎమ్మెల్యేలకు చెప్పడం, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చాలామంది గ్రామాల్లో తిరగలేదు అని నేరుగా ఎమ్మెల్యేల సమీక్షలో చెప్పారు. దీంతో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును పోగొట్టుకోవాల్సి వచ్చింది.
దీంతో సీఎం జగన్ వెంటనే తన రూట్ మార్చేశారట. అవును.. తన రూట్ మార్చి వెంటనే ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారట. అతిగా ఎమ్మెల్యేలను భయపెడితే వచ్చే ఎన్నికల్లో ప్రాబ్లమ్ అవుతుందని ఆలస్యంగా వైఎస్ జగన్ గుర్తించారు. ఇటీవల నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేసిన విషయం తెలిసిందే. దాని వల్ల వైసీపీకి నష్టమే చేకూరింది. ఇలా.. మున్ముందు ఎమ్మెల్యేలపై సీరియస్ అయితే ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ చూసుకునే ప్రమాదం ఉందని గ్రహించిన జగన్.. ఇటీవల జరిగిన సమీక్షలో టికెట్లు ఎటూ పోవు.. సిట్టింగ్స్ అందరికీ టికెట్లు వస్తాయి.. అన్నట్టుగా మాట్లాడటంతో ఎమ్మెల్యేలు అంతా షాక్ అయ్యారట.
YS Jagan : అప్పుడు ప్రజారాజ్యం.. ఇప్పుడు జనసేన
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకొని వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వల్ల చంద్రబాబు టీడీపీపై ప్రభావం పడిన విషయం తెలుసు కదా. 2024 ఎన్నికల్లో జనసేన వల్ల కూడా అదే నష్టం జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు ఈసారి ఎలాగైనా జనసేనతో పోటీ పెట్టుకోవాలని అనుకుంటున్నారట. జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి దెబ్బ పడే ప్రమాదం ఓవైపు ఉండటం, మరోవైపు ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారో అని సీఎం జగన్ వాళ్లను బుజ్జగించే పనిలో పడ్డారట. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో.