YS Jagan : చంద్రబాబును అరెస్ట్ చేయించాల్సిన కర్మ నాకు పట్టలేదు.. చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబును కావాలని ఆయనపై అక్రమ కేసులు పెట్టి మరీ అరెస్ట్ చేయించారని.. ఆయన అరెస్ట్ వెనుక ఉన్నది ఎవరో కాదు ఏపీ సీఎం వైఎస్ జగన్ అని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై తాజాగా సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ అయినా కాకున్నా ఆయన జైలులో ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు అన్నారు. ఆయనకు క్రెడిబిలిటీ లేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఒక్కటే. ఆయనకు విశ్వసనీయత లేదు. చంద్రబాబును చూసినప్పుడు చంద్రబాబు పార్టీని చూసినప్పుడు పేద వాళ్లకు, ప్రజలకు గుర్తు వచ్చేది ఒక్కటే. మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. చంద్రబాబును చూసినప్పుడు కానీ.. చంద్రబాబు పార్టీని చూసినప్పుడు కానీ.. ప్రజలకు గానీ.. పేద వాళ్లకు కానీ గుర్తుకొచ్చేటివి ఇవే. మోసాలు.. వెన్నుపోట్లు.. అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అదే మన పార్టీని చూసినప్పుడు కానీ.. వాళ్ల బిడ్డ, వాళ్ల అన్న, వాళ్ల తమ్ముడు జగన్ ను చూసినప్పుడు కానీ ఆ ప్రతి రైతన్నకు గుర్తుకొస్తుంది, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు గుర్తుకొస్తుంది.. సామాజిక న్యాయం గుర్తుకొస్తుంది. గ్రామాల్లో మారిన వైద్యం, మారిన స్కూళ్లు, మారిన వ్యవసాయం, ప్రాంతాల మధ్య న్యాయం, లంచాలు, వివక్ష లేని వ్యవస్థ, అక్క చెల్లెమ్మలు ధైర్యంగా ఒక ఫోన్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లగలిగే ధైర్యం, ఏ అక్క చెల్లెమ్మ కూడా ఫోన్ పట్టుకొని ఆపదలో ఉన్నప్పుడు ఒక ఐదు సార్లు ఇలా ఇలా షేక్ చేసినా ఒక ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా అక్షరాలా ఈరోజున అక్కచెల్లెమ్మలు కోటీ 24 లక్షల ఫోన్లలో దిశ యాప్ ఉంది. అక్షరాలా నా అక్కచెల్లెమ్మలు 5 సార్లు ఇలా షేక్ చేసినప్పుడు కానీ.. నా అక్కచెల్లెమ్మలు ఎస్వోఎస్ బటన్ నొక్కినప్పుడు కానీ 30,336 మందికి తోడుగా నిలబడగలిగిన ఒక మంచి పోలీస్ అన్న, ఆ పోలీస్ అన్న రూపంలో ఒక మంచి జగనన్న, ఆ అక్కాచెల్లెమ్మలకు గుర్తుకొస్తుంది.. అని జగన్ అన్నారు.
YS Jagan : చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు
చంద్రబాబును ఎవ్వరూ కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు. చంద్రబాబు అనే వ్యక్తి మీద నాకు ఎలాంటి కక్ష లేదు. ఆ అరెస్ట్ కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు, జగన్ లండన్ లో ఉన్నప్పుడు, చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఆయన్ను కక్ష సాధింపు కోసం అరెస్ట్ చేశారు అని అనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీలో టీడీపీ మనుషులే ఉన్నారు. కేంద్రంలో ఇన్ కమ్ ట్యాక్స్, కేంద్రంలోనే ఈడీ, చంద్రబాబు మీద విచారణలు జరిపి ఆయన మీద అవినీతిని నిరూపించింది. దోషులను అరెస్ట్ చేసింది. ఐటీ వాళ్లు నోటీసులు ఇచ్చారు.. అంటూ జగన్ చెప్పుకొచ్చారు.