TDP – Janasena : టీడీపీ, జనసేన వాళ్లకు మైండ్ దొబ్బింది.. జగనన్న ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మగాడిలా సీఎం అయ్యారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP – Janasena : టీడీపీ, జనసేన వాళ్లకు మైండ్ దొబ్బింది.. జగనన్న ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మగాడిలా సీఎం అయ్యారు

 Authored By kranthi | The Telugu News | Updated on :21 October 2023,9:00 pm

TDP – Janasena : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీపై టీడీపీ వాళ్లు ఫైర్ అవుతుంటే.. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతే కాదు.. ఒకరిని మరొకరు తిట్టుకోవడం కామన్ అయిపోయింది. తాజాగా వైసీపీ నాయకురాలు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లకు మైండ్ దొబ్బిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల వాళ్లకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కానీ.. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కానీ లేదా? ఎక్కడో చంద్రబాబు తప్పులు చేసి దొరికిపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి క్రిమినల్ గా పట్టుబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తే ఆ తప్పులను వెనకేసుకొస్తూ జనాలు, ప్రతిపక్షాల వాళ్లు ఒక మెంటల్ డిజార్డర్ వచ్చిందేమో అనిపిస్తోంది. అసలు వాళ్లు ఏం మాట్లాడుతున్నారు.. ఏం చేస్తున్నారు.. పబ్లిక్ ను ఎటు తీసుకెళ్తున్నారు అనేది అర్థం కావడం లేదు అంటూ మండిపడ్డారు.

ఎన్నికల్లో ఎటూ కంటెస్ట్ చేయలేం.. రాలేం అని మీకు ముందే తెలిసిపోయిందా? భువనేశ్వరి, బ్రాహ్మణి ఖచ్చితంగా ఆలోచించాలి. లేడీస్ ను వెపన్స్ గా పెట్టుకొని సీఎం మీద, ఆయన కుటుంబం మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి భువనేశ్వరి. అసలు ఏం జరుగుతోంది. ఒకప్పుడు ఏదో ఒక చిన్న లెటర్ ను బేస్ చేసుకొని ఎలాంటి ఆధారాలు లేకుండా 16 నెలలు రిమాండ్ లో బంధించి నిర్దాక్షిణ్యంగా ఎన్నో సమస్యలు క్రియేట్ చేసినా జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ తొణకలేదు. ఎవ్వరూ ఆయన వైపు మాట్లాడిన వారు లేరు. పబ్లిక్ ను కూడా ఏనాడూ డిస్టర్బ్ చేయలేదు. బయటికి వచ్చి ప్రజా సంకల్ప యాత్ర చేసి ప్రజా తీర్పు ద్వారా ప్రజల మనిషిగా పీఠాన్ని దక్కించుకున్నారు.. అన్నారు.

ysrcp leader fires on tdp and janasena leaders

#image_title

TDP – Janasena : ప్రతిపక్షాలు ధైర్యంగా ముందుకు రండి

ప్రతిపక్షాలు ధైర్యంగా వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి నిరూపించుకోండి. అంతే కానీ.. రాజకీయాలకు సంబంధం లేని మాటలను మాట్లాడకండి. భువనేశ్వరి మీరు ఒక మహిళే కదా. సెంట్రల్ లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చి మహిళలను గౌరవిస్తున్నారు. చట్టసభల్లోకి మహిళలు రావాలని ఇదంతా చేస్తున్నారు. మరి కేంద్రంలోనే మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే.. మీరు ఎందుకు ఇలా మహిళలను అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నారు. ఈ గ్రాఫిక్స్ ఏంటి.. ఈ మార్పులు ఏంటి. మీరైనా సరే.. కొంచెం చొరవ తీసుకొని వీటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక టీడీపీ కాదు.. వైసీపీ కాదు.. జనసేన కాదు.. మహిళలకు సంబంధించింది.. మహిళలను ఎందుకు పావుగా వాడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆలోచిస్తున్నారు. ఒక పక్క మన రాష్ట్రం గురించి దేశంలోనే ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.. అవన్నీ మీకు కనిపించడం లేదా? అంటూ ఆమె మండిపడ్డారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది