10th Class Diaries First Review : `టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమా ఫాస్ట్ రివ్యూ & రేటింగ్..
10th Class Diaries First Review : శ్రీరామ్ మరియు అవికా గోర్ నటించిన 10th క్లాస్ డైరీస్ చిత్రం నేడు విడుదల కాగా, ఈ మూవీ విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసింది, ఎందుకంటే టీజర్ మరియు ట్రైలర్ చాలా కూల్‌గా కనిపించడంతొ ఈ చిత్రం జూలై 01, 2022 న విడుదలైంది, చిత్రం ప్రేక్షకుల నుండి అలాగే విమర్శకుల నుండి మంచి స్పందనలు అందుకుంది . ఈ సినిమా కథ ఏంటి తెలుసుకోవాలి అంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే మరి.
కథ : సోము(శ్రీరామ్) బాగా చదువుకుని అమెరికాలో సెటిల్ అవుతాడు. అన్నీ ఉంటాయి కాని ఏదో మిస్సింగ్. కట్టుకున్న భార్య కూడా వదిలేస్తుంది. తాను మిస్ అవుతున్న ఆనందం ఏంటి?, ఆ ఆనందం ఎక్కడుంది? ఎలా వస్తుందనే వెతికే క్రమంలో స్కూల్ టైమ్‌లో తాను ప్రేమించిన ఫస్ట్ లవ్ చాందిని దగ్గరుందని తెలుసుకుంటాడు. ఆమెని కలిసేందుకు రీయూనియన్ సాకుగా మలుచుకుంటాడు. కానీ రీ యూనియన్‌కి తన చాందిని మాత్రమే హాజరు కాదు. మరి ఆమె రాకపోవడానికి కారణమేంటి? సోము, చాందిని స్కూల్ లవ్ స్టోరీ ఏంటి? వాళ్లిద్దరు ఎలా విడిపోయారు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్ : శ్రీరామ్ చాలా రోజుల తర్వాత లవర్ బాయ్‌గా, అదే సమయంలో బిజినెస్ మ్యాన్‌గా, ప్రేమ కోసం తపించే పాత్రలో బాగా చేశారు. అతనిలో కాస్త ఈజ్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే అవికా గోర్ పాత్ర నిడివి తక్కువగానే ఉంటుంది. ఆమె పాత్రని పెంచితే బాగుండేది. ఆ లోటు ఆడియెన్స్ ఫీలవుతారు. హీరో ఫ్రెండ్‌గా గౌరవ్ పాత్రలో నిర్మాత రామారావు ఇరగదీశారు. చాలా రోజుల తర్వాత శ్రీనివాస్ రెడ్డి పాత్ర బాగా పేలిందని చెప్పొచ్చు. రీయూనియన్‌లో తాగుబోతు రమేష్ ఎపిసోడ్ కాస్త చిరాకు పుట్టిస్తుంది. మిగిలిన ఫ్రెండ్స్ గా అర్చన, హిమజ, భాను, హీరోయిన్ తండ్రి నాజర్ పాత్రలు ఉన్నంతలో ఫర్వాలేదనిపిస్తాయి.
సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడే కెమెరామెన్. అనుభవం ఉన్న సినిమాటోగ్రాఫర్ కావడం, తనదే సినిమా కావడంతో విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. పెద్ద సినిమా స్థాయిలో విజువల్స్ ఉండటం విశేషం. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. ఈ సినిమాకి తగ్గట్టుగా నిర్మాణం విషయంలో రాజీపడలేదనే విషయం సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఎడిటర్ ఇంకాస్త తన కత్తికి పదును పెట్టాల్సింది.
ప్లస్ పాయింట్స్ : నటీనటుల పర్‌ఫార్మెన్స్
శ్రీనివాస్ రెడ్డి కామెడి
టేకింగ్
మైనస్ పాయింట్స్ : తాగుబోతు రమేష్ కామెడీ
ఎడిటింగ్
విశ్లేషణ : `టెన్త్ క్లాస్ డైరీస్` సినిమా నిర్మాత రామారావు లైఫ్‌లో తాను చూసిన రియల్ ఇన్స్ డెన్స్ ఆధారమే ఈ సినిమా కథ. ప్రేమికుడి నిర్లక్ష్యం, తండ్రి అతి ప్రేమ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాయనేది ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నారు. చాలా మందికి స్కూల్ డేస్‌ని గుర్తు చేస్తుంది. మెమరీస్‌ని రీకలెక్ట్ చేస్తుంది.
రేటింగ్ 2.5/ 5