Bachhala Malli Movie Review : బచ్చల మల్లి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Bachhala Malli Movie Review : బచ్చల మల్లి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Bachhala Malli Movie Review : నటీనటులు: అల్లరి నరేష్, అమృతా అయ్యర్, అంకిత్ కోయ, హరితేజ, రావు రమేష్, కోట జయరాం, ధన్‌రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులు
కథ, రచన, దర్శకత్వం: సుబ్బు మంగాదేవి
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు, విశ్వ నేత్ర
నిర్మాత: రాజేశ్ దండా, బాలాజీ గుట్ట
సినిమాటోగ్రఫి: రిచర్డ్ ఎం నాథన్
ఎడిటింగ్: చోటా కే ప్రసాధ్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
బ్యానర్: హాస్య మూవీస్
రిలీజ్ డేట్: 20-12-2024
అల్లరి నరేష్ కామెడీ సినిమాలతో హీరోగా ఎదిగాడు. ఒకప్పుడు కామెడీనే ఆయన బలం. కానీ ఇప్పుడు అదే ఆయన మైనస్ కావడంతో యాక్షన్ థ్రిల్లర్స్ తో మెప్పిస్తున్నారు. నాంది చిత్రంతో హిట్ కొట్టాడు. మళ్లీ ఉగ్రం`తో ఫర్వాలేదనిపించాడు. ఇటీవల `నా సామిరంగా`తోనూ ఎమోషనల్ పాత్ర చేసి మెప్పించాడు..ఇప్పుడు `బచ్చల మల్లి అనే సినిమా చేశాడు నరేష్. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందనేది చూద్దాం..

Bachhala Malli Movie Review : బచ్చల మల్లి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Bachhala Malli Movie Review కథ:
మల్లి (నరేష్)కు తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. తండ్రికి కొడుకు అంటే ప్రేమ. కాని వేరే మహిళతో ఆయనకు సంబంధం ఉంది. ఆ బంధాన్ని నరేష్ తాతయ్య అంగీకరించడు. దాంతో మల్లి, అతని తల్లి (రోహిణి)ని వదిలేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆ క్షణం నుంచి తండ్రి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు మల్లి. సిగరెట్, మందు, వేశ్యల దగ్గరకు వెళ్లడం అలవాటు చేసుకుంటాడు. అటువంటి మల్లికి కావేరి అమృత అయ్యర్ పరిచయం అయ్యాక మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. చెడు అలవాట్లు అన్నీ మానేస్తాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న మల్లి జీవితం మళ్లీ వెనక్కు వెళ్ళింది? తాగిన మత్తులో రోడ్డు మీద పడి ఉన్న అతడిపై హత్య ప్రయత్నం చేసింది ఎవరు? గోనె సంచుల వ్యాపార సంఘం ప్రెసిడెంట్ గణపతి రాజు అచ్యుత్ కుమార్ ఏం చేశాడు? మల్లి జీవితంలోకి వచ్చిన రమణ (అంకిత్ కొయ్య) ఎవరు చివరకు ఏమైంది అనేది చిత్ర కథ.
Bachchala Malli Movie Review నటీనటుల పర్‌ఫార్మెన్స్:
కమెడియన్‌గా ముద్ర వేసుకొన్పప్పటికీ ..మల్లిగా తన పాత్రలో నరేష్ పరకాయ ప్రవేశమే చేశారనే చెప్పాలి. కమెడియన్ నరేష్‌కు ఎక్కడా పొంతనా ఉండదు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టడమే కాకుండా అవార్డు విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. నరేష్, రావు రమేష్, అచ్యుత్ కుమార్, అమృతా అయ్యర్ వంటి మంచి ఆర్టిస్టులు కాగా వారు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మిగతా నటీనటులు అంతా కూడా తమ తమ పాత్రలలో మెప్పించారు
Bachhala Malli Movie Review టెక్నికల్ పర్‌ఫార్మెన్స్ :
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, యాక్షన్ కోరియోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. తుని పరిసర ప్రాంతాలను అందంగా తెరకెక్కించారు. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ సినిమాను గ్రిప్పింగ్‌గా మార్చింది. ఉత్తమ చిత్రాలను అందించే రాజేశ్ దండ అనసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ఓన్లీ క్లైమాక్స్
అల్లరి నరేష్ నటన
రిచర్డ్ ఎం నాథన్ కెమెరా వర్క్
మైనస్ పాయింట్స్:
కథ
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
వీక్ రైటింగ్
Bachchala Malli Movie Review విశ్లేషణ:
క్లవర్ స్టూడెంట్ తండ్రి చేసిన పనికి ఒక్కసారిగా తాగుబోతుగా మారడం అనేది అంత బలంగా అనిపించలేదు. ఒక సీన్ తర్వాత మరో సీన్ వస్తుంది తప్పితే సినిమాలో సోల్ మిస్ అయ్యింది. ఎమోషనల్‌గా ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోతాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక అటెన్షన్ స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో దాన్ని క్యారీ చేస్తూ ఎమోషన్స్ ని కాస్త పీక్‌కి తీసుకెళ్లి ముగించారు. కథ కూడా ఓల్డ్ గానే అనిపిస్తుంది. కాకపోతే అందులో మలుపులు మాత్రం కొత్తగా ఉంటాయి. సినిమా అంతా స్లోగా రన్ అవుతుంది. మధ్యలో కొన్ని చోట్ల ప్రవీణ్, హరితేజ, వైవా హర్ష కామెడీ ఫర్వాలేదు. పాటలు బాగున్నాయి. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో యూనిక్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన సుబ్బు మంగాదేవి, అంతే యూనిక్ ఫిల్మ్ తీయడంలో – క్యారెక్టరైజేషన్ మైంటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. జనాలని మెప్పించి కూర్చోపెట్టే సత్తా ఈ సినిమాకి లేదని చెప్పాలి..
రేటింగ్: 2.25