Brahma Anandam Movie Review : బ్రహ్మా ఆనందం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Brahma Anandam Movie Review : బ్రహ్మా ఆనందం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Brahma Anandam Movie Review : మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

Brahma Anandam Movie Review : బ్రహ్మా ఆనందం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
నటులు: బ్రహ్మానందం, రాజా గౌతమ్,ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్
దర్శకుడు: Rvs నిఖిల్
సినిమా శైలి: తెలుగు, డ్రామా
వ్యవధి: 2 గంటల 20 నిమిషాలు
రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి 2025
Brahma Anandam Movie Review ఆద్యంతం వినోదంతో..
సినిమాలో ఆయన కుమారుడు రాజా గౌతమ్ కూడా నటిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్‌తో సాగింది. థియేటర్ ఆర్టిస్ట్ అయిన బ్రహ్మ ఆనందం ఢిల్లీలో జరిగే నేషనల్ షో లో పాల్గొనాలని అనుకుంటాడు. అయితే, దీని కోసం డబ్బులు అవసరం పడటంతో, బ్రహ్మానందం మనవడిగా నటించేందుకు అంగీకరిస్తాడు. ఇక వారిద్దరి మధ్య జరిగే పరిణామాలను మనకు ఈ సినిమాలో కథగా చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్‌లో రాజా గౌతమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా పలికించిన తీరు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
దర్శకుడు ఆర్‌విఎస్ నిఖిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా రాహుల్ యాదవ్ నక్కా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా దర్శకుడు ఆర్‌విఎస్ నిఖిల్ రూపొందించాడు. ఈ మూవీపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో మేకర్స్ స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు తెలిపారు.
Brahma Anandam Movie Review కథ :
చిన్నతనంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన బ్రహ్మనందం (రాజా గౌతమ్)కి స్కూల్ డేస్ నుంచే నటన అంటే చాలా ఇష్టం. బంధువులకు దూరంగా నాకు నేనే.. నా కోసం నేనే అనే విధంగా ఆలోచిస్తూ స్నేహితుడు గిరి (వెన్నెల కిషోర్)తో తిరుగుతూ ఉంటాడు. ఇక తొమ్మిదేళ్లుగా ఎలాంటి ఉద్యోగం లేకుండా, అప్పులు చేస్తూ జీవనాన్ని గడుపుతున్న బ్రహ్మానందానికి థియేటర్ ఆర్టిస్ట్‌గా నిరూపించుకునే ఓ అవకాశం వస్తుంది. ఇందుకు ఆరు లక్షలు అవసరం పడతాయి. బ్రహ్మానందం ప్రేయసి తార (ప్రియ వడ్లమాని) సాయం చేయాలని అనుకుంటుంది. అయితే ఈ సమయంలోనే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటున్న తాన తాత బ్రహ్మానందమూర్తి ( బ్రహ్మానందం)ని కలుసుకుంటాడు. కొన్ని కండిషన్లు పాటిస్తే తన ఆరు ఏకరాల భూమిని అమ్మి డబ్బులు ఇస్తానని తాత మాటిస్తాడు. ఇందుకోసం కొన్ని షరతులు పెడతాడు. బ్రహ్మానందం ఆ కండిషన్లు పాటిస్తాడా? ఆ షరతులు ఏమిటి? అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది.
Brahma Anandam Movie Review విశ్లేషణ :
వయసుతో సంబంధం లేకుండా తోడు ఉంటేనే జీవితానికి ఒక అర్థం అని తెలియజెప్పే చిత్రమే ‘బ్రహ్మా ఆనందం’. పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్న ప్రేమకథలు రొటీన్. వృద్ధ వయసులో ఉన్న ఆ పెద్దలే ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే వైవిధ్యభరిత వృద్ధ ప్రేమకథే ‘బ్రహ్మా ఆనందం’. జీవితం చరమాంకంలో ఎవరికైనా ఓ తోడు కావాలి, ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అనే ఓ కాన్సెప్ట్‌ను ఎంచుకుని దర్శకుడు ఈ కథను మొదలుపెట్టాడు. తొలిభాగం ఎంత స్లోగా ఉంటుందో, ద్వితియార్థం కూడా అంతకుమించిన నత్తనడకతో సినిమా ఆసాంతం ఉంటుంది..
దర్శకుడు ఈ సినిమాను అటు ఎంటర్‌టైన్‌మెంట్ బాటలో, ఇటు ఎమోషన్స్‌ను పండిస్తూ హృదయాన్ని హత్తుకునే సినిమాగా అలరించాలని చేసిన ప్రయత్నంలో పూర్తిగా సఫలీకృతుడు కాలేక పోయాడు అనే చెప్పాలి. సినిమాలో ఎక్కడా కూడా పాత్రలతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం కానీ, ఆ పాత్రల ఎమోషన్స్ మనం ఫీల్ అయ్యే సన్నివేశాలు కానీ పెద్దగా లేవు.సినిమా మొత్తం స్లోగా, మధ్య మధ్యలో కాస్త వినోదాన్ని పంచుతూ సో..సో..గా సాగుతుంది. అసలు ఈ సినిమా ద్వారా ఆడియన్స్‌కు ఏం చెప్పాలని అనుకున్నారో కూడా కొంత కన్ఫ్యూజింగ్‌గా ఉంటుంది.