Keeda Cola Movie Review : ‘కీడా కోలా’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Keeda Cola Movie Review : ‘కీడా కోలా’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Keeda Cola Movie Review : కీడా కోలా.. సినిమా పేరే విచిత్రంగా ఉంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం అంటే అలాగే ఉంటది మరి. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ ఏ సినిమా వచ్చినా అది వెరైటీగానే ఉంటుంది. అందులోనూ మనోడి సినిమాల్లో ఎంటర్ టైన్ మెంట్ పక్కా. అది రాసిపెట్టుకోవాల్సిందే. ఒక పెళ్లి చూపులు, ఒక ఈనగరానికి ఏమైంది సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆ మూడు సినిమాలు సూపర్ […]

 Authored By gatla | The Telugu News | Updated on :3 November 2023,1:52 pm

Cast & Crew

  • Hero : చైతన్య మందాడి(Chaitanya Mandadi)
  • Heroine : No Heroine
  • Cast : బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రాగ్ మయూర్, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌కుమార్‌, విష్ణు, హరికాంత్
  • Director : తరుణ్ భాస్కర్
  • Producer : కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్
  • Music : వివేక్ సాగర్
  • Cinematography : ఏజే ఆరోన్‌

Keeda Cola Movie Review : కీడా కోలా.. సినిమా పేరే విచిత్రంగా ఉంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం అంటే అలాగే ఉంటది మరి. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ ఏ సినిమా వచ్చినా అది వెరైటీగానే ఉంటుంది. అందులోనూ మనోడి సినిమాల్లో ఎంటర్ టైన్ మెంట్ పక్కా. అది రాసిపెట్టుకోవాల్సిందే. ఒక పెళ్లి చూపులు, ఒక ఈనగరానికి ఏమైంది సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత తన దర్శకత్వంలో వచ్చిన మూడో మూవీ కీడా కోలా. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటించగా.. తరుణ్ భాస్కర్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించాడు. చైతన్య రావు, రాక్ మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, హరికాంత్ తదితరులు నటించిన ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పించారు. వివేక్ సుధాంఘు, శ్రీపాద్, శ్రీనివాస్ కౌశిక్ నిర్మాతలు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్.

తరుణ్ భాస్కర్ ఒకటే ఫార్మాట్ ను ఫాలో అవుతాడని తెలుసు కదా. అదే ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్. తన సినిమాలో కామెడీకి కొదవ ఉండదు. అలాగే.. మనోడి సినిమాల్లో స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన తీసింది రెండే సినిమాలు అయినా తరుణ్ భాస్కర్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది. దానికి కారణం.. ఆయన సినిమాల్లో ఉండే ఎంటర్ టైన్ మెంట్. ప్రేక్షకులపై తనదైన ముద్ర వేశాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు కీడా కోలా కూడా కామెడీనే కాకపోతే క్రైమ్ కామెడీ అని చెప్పుకోవాలి. మరి.. ఈ సినిమా ఎలా ఉంది.. అసలు ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం రండి.

Keeda Cola Movie Review : కథ

ఈ సినిమా కథ వరదరాజుతో ప్రారంభం అవుతుంది. వరదరాజు అంటే బ్రహ్మానందం, అతడి మనవడు వాస్తు(చైతన్య). ఇక.. వీళ్లకు తోడుగా కౌశిక్(రాక్ మయూర్). ఈ ముగ్గురి లక్ష్యం ఒక్కటే. అదే డబ్బులు సంపాదించడం. ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. దాని కోసం ఏదైనా చేయాలి అనే తత్వం వీళ్లది. ఒకరోజు వరదరాజు కోసం వాస్తు ఒక కూల్ డ్రింక్ కొంటాడు. అందులో చూస్తే బొద్దింక ఉంటుంది. ఎలాగైనా దీన్న సాకుగా పెట్టి డబ్బులు గుంజాలనేది వీళ్ల ప్లాన్. మరోవైపు జీవన్ కార్పొరేటర్ కావాలని కలలు కంటుంటాడు. చాలా ఏళ్ల పాటు జైలులో ఉండి బయటికి వచ్చిన తన అన్న నాయకుడు(తరుణ్ భాస్కర్) తనకు అండగా నిలబడతాడు. కానీ.. జీవన్ కార్పొరేటర్ కావాలంటే డబ్బు కావాలి. దాని కోసం నాయుడు ఓ ప్లాన్ వేస్తాడు. అటు వాస్తు, వరదరాజు.. ఇటు నాయుడు, జీవన్.. వీళ్ల మెయిన్ ఫోకస్ డబ్బు మీదే. మరి ఆ డబ్బును సంపాదిస్తారా? ఈ రెండు గ్రూపులు ఎలా కలుస్తాయి. బొద్దింక పడ్డ కూల్ డ్రింక్ కథ ఏంటి? చివరకు డబ్బులు ఎవరికి దక్కాయి అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

Keeda Cola Movie Review : విశ్లేషణ

నిజానికి ఈ సినిమా కేవలం ఒక కూల్ డ్రింక్ బాటిల్ చుట్టూనే తిరుగుతుంది. కానీ.. ఆ సమయంలో జనరేట్ అయిన కామెడీ అద్భుతంగా ఉంటుంది. సినిమా అస్సలు బోర్ మాత్రం కొట్టదు. సినిమాలో నాయుడు పాత్ర అదుర్స్ అని చెప్పుకోవాలి. కామెడీతో పాటు యాక్షన్ కూడా ఈ సినిమాకు ప్లస్ అనే చెప్పుకోవాలి. చైతన్య రావు, తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం తమ పాత్రల మేరకు అద్భుతంగా నటించారు. మిగితా వాళ్లు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కామెడీతో పాటు ఒక క్రైమ్ స్టోరీ, సస్పెన్స్, త్రిల్లర్ ను జోడించి తరుణ్ భాస్కర్ ఈ కథను రాసుకున్నాడు. ఆ కథను జస్టిఫై చేయడంలో సక్సెస్ కాగలిగాడు.

ప్లస్ పాయింట్స్

క్రైమ్ కామెడీ త్రిల్లర్ బ్యాక్ డ్రాప్

ఎంటర్ టైన్ మెంట్

సెకండ్ హాఫ్

నేపథ్య సంగీతం

తరుణ్ భాస్కర్ టేకింగ్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్

నాటకీయత

ఇంటర్వెల్ సీన్

Rating :

2.53/5

Also read

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది