Lambasingi Movie Review : లంబసింగి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Lambasingi Movie Review : లంబసింగి మూవీ రివ్యూ తెలుగమ్మాయి, బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘మహర్షి’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాలతో పాటు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, జగపతి బాబు ‘రుద్రంగి వంటి సినిమాలలో నటించి మెప్పించిన అందాల భామ దివి. ఈ అమ్మడు ‘మా నీళ్ల ట్యాంక్’, ‘ఏటీఎం’ వెబ్ సిరీస్‌లు సైతం చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అయితే ఇప్పుడు దివి కథానాయికగా రూపొందిన ‘లంబసింగి చిత్రం […]
ప్రధానాంశాలు:
Lambasingi Movie Review : లంబసింగి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Lambasingi Movie Review : లంబసింగి మూవీ రివ్యూ తెలుగమ్మాయి, బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘మహర్షి’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాలతో పాటు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, జగపతి బాబు ‘రుద్రంగి వంటి సినిమాలలో నటించి మెప్పించిన అందాల భామ దివి. ఈ అమ్మడు ‘మా నీళ్ల ట్యాంక్’, ‘ఏటీఎం’ వెబ్ సిరీస్‌లు సైతం చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అయితే ఇప్పుడు దివి కథానాయికగా రూపొందిన ‘లంబసింగి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పకులుగా వ్యవహరించారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. భరత్ రాజ్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Lambasingi Movie Review కథ
వీరబాబు( భరత్ రాజు) లంబసింగి అనే ఊరిలో కానిస్టేబుల్‌గా ఎంపిక అవుతాడు. అతను జాబ్ కోసం లంబసింగికి వెళ్లగా అక్కడ బస్సు దిగగానే హరిత(దివి) ని చూసి ఆమె ప్రేమలో పడిపోతాడు. అయితే హరిత మాజీ నక్సలైట్ కూతురు కాగా, ఆమెని ప్రేమలో పడేయడానికి వీరబాబు నానా కష్టాలు పడతాడు. హరిత ఊరిలో నర్సుగా పని చేస్తుండగా, వీరబాబు పునరావాసం కల్పించిన మాజీ నక్సలైట్లని గమనిస్తూ ఉండే పోలీస్‌గా కనిపిస్తాడు. అయితే హరిత ప్రేమ గెలుచోవడానికి వీరబాబు రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టించడానికి వారి ఇంటికి వెళ్లి వస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో వ్యక్తి ప్రాణాపాయంతో ఉండగా, అతడిని కాపాడే క్రమంలో హరితకి వీరబాబు కాస్త దగ్గరవుతాడు. అదే సమయంలో తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. ధైర్యం చేసి హరితకి తన ప్రేమ గురించి చెప్పగా అందుకు ఆమె ఒప్పుకోదు. ఇక ఆ బాధలో ఉన్న సమయంలో వీరబాబు ఉన్న పోలీస్ స్టేషన్‌పై నక్సలైట్స్ దాడి చేసి అక్రమంగా ఆయుధాలని తీసుకెళతారు. ఆ తర్వాత ఏం జరిగింది, వీరబాబు, హరిత జీవితాలలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి అనేది చిత్రం చూస్తే తెలుస్తుంది.
Lambasingi Movie Review : నటీనటుల పర్‌ఫార్మెన్స్
దివి ఇప్పటికే చాలా చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పటివరకు గ్లామర్ పాత్రలలో కనిపించిన అమ్మడు లంబసింగిలో మాత్రం తన సహజమైన నటనతో అలరించింది. ఆమెకి ఇచ్చిన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది. దర్శకుడు నవీన్ గాంధీ ఆమెలోని టాలెంట్ గుర్తించి చాలా చక్కగా వాడాడు. హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్రలో ఒదిఇపోయాడు. క్లైమాక్స్‌లో అతను తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. మిగతా నటీనటులు వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య తమ పాత్రలకి న్యాయం చేశారు.
Lambasingi Movie Review టెక్నికల్ పర్‌ఫార్మెన్స్
దర్శకుడు నవీన్ గాంధీ చిత్రాన్ని మలిచిన తీరు బాగుంంది. ఎవరికి ఎక్కడ బోర్ కొట్టించకుండా నడిపించాడు. 2 గంటల 2 నిమిషాలు సినిమా డ్యూరేషన్ కాగా సినిమా ఎక్కడ మనకు బోర్ కొట్టించదు. సెకండ్ హాఫ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా అలరిస్తాయి. ఇక సంగీత దర్శకుడు కూడా తన అద్భుతమైన సంగీతంతో కట్టిపడేసాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. బుజ్జి అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ విజయ్ వర్ధన్ కూడా తన పనితనంతో మెప్పించాడు.
Lambasingi Movie Review : విశ్లేషణ :
లంబసింగి చిత్రం ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని పంచింది అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో సినిమా కాస్త సోసోగా అనిపించిన కూడా తర్వాత మాత్రం ప్రేక్షకులని రక్తి కట్టించే విధంగా ఉంటుంది. హీరోయిన్ ట్రాక్‌ని దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్‌ని కూడా దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. స్క్రీన్ ప్లే సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. బోర్ కొట్టకుండా వీరబాబు, రాజు గారు పాత్రలతో దర్శకుడు మంచి వినోదం పండించాడు. ఇక క్లైమాక్స్‌లో చాలా ఎమోషనల్ పండించాడు. దర్శకుడు నవీన్ గాంధీ ఎంచుకున్న పాయింట్ తీసిన విధానం ప్రతి ఒక్కరికి తప్పక నచ్చుతుంది. ఆడియన్స్ ఏ మాత్రం బోర్ ఫీల్ కారు.
చివరి మాట : ‘లంబసింగి చిత్రం చూసి థియేటర్ నుండి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు చాలా హ్యాపీగా ఉంటారు. థియేటర్స్‌లో తప్పక చూడాల్సిన చిత్రం ఇది. మిమ్మల్ని ఈ మూవీ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి మంచి వినోదం అందిస్తుంది.
రేటింగ్ : 3.5/5