Love Story Movie Review : నాగ‌చైత‌న్య ‘లవ్ స్టోరి’ మూవీ రివ్యూ.. ప్రేమ, సంఘర్షణపై భిన్న కోణం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Love Story Movie Review : నాగ‌చైత‌న్య ‘లవ్ స్టోరి’ మూవీ రివ్యూ.. ప్రేమ, సంఘర్షణపై భిన్న కోణం..!

 Authored By mallesh | The Telugu News | Updated on :24 September 2021,11:02 am

Love Story Movie Review  కొవిడ్ మహమ్మారి వల్ల చాలా సినిమాలు ఓటీటీకే ఓటు వేస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది. ఇకపోతే పెద్ద సినిమాల విడుదల వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరి’ చిత్రం విడుదల అయింది. భారీ అంచనాలతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 900 థియేటర్స్‌లో విడుదల అయింది. అక్కినేని నాగచైతన్య ఈ చిత్రంలో హీరోగా నటించగా, ఆయన సరసన క్యూట్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. తన ప్రతీ సినిమాలో డిఫరెంట్ ఇష్యూస్ అడ్రస్ చేస్తుంటారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇక ఈ లవ్ స్టోరి సినిమాలో కులం, కుల వివక్ష వంటి సున్నితమైన అంశాలను టచ్ చేశారు.

naga chaitanya Love Story Movie Review

naga chaitanya Love Story Movie Review

స్టోరీ.. Love Story Movie Review

చిత్రంలో హీరో నాగచైతన్య రేవంత్ అనే పాత్ర పోషించారు. ఓ వ్యాపారాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్ సిటీకి వ‌చ్చి , జుంబా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. యువతులు, మహిళలకు డ్యాన్స్ నేర్పిస్తుంటాడు రేవంత్. మౌనిక (సాయి పల్లవి) నాగచైతన్య(రేవంత్) గ్రామమైన ఆర్మూర్‌కు చెందిన ధనవంతురాలు. ఆమె బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం పొందాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా హైదరాబాద్ సిటీకి వస్తుంది. అయితే, ఆమె ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అనుకున్న‌ది సాధించ‌లేక‌పోతుంది. కాగా, ఈ క్రమంలోనే రేవంత్ , మౌనిక ఒకరినొకరు ఎలా కలుస్తారు? వారు ఎలా ప్రేమలో పడ్డారు? వారు ఎదుర్కొనే సంఘర్షణ ఏంటి అన్న‌ది సిల్వర్ స్క్రీన్‌పై ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్. ప్రతీ ఒక్కరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే అనేలా ఉంది ఈ సినిమా. ఫిల్మ్‌లో ఉమన్, జెండర్ బయాస్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి చర్చించారు.

న‌టీన‌టుల న‌ట‌న‌: Love Story Movie Review

నాగచైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన యాస్ చక్కగా మాట్లాడాడు. సినిమా మొత్తం కూడా చైతు, సాయి పల్లవి భుజస్కందాలపైనే సాగింది. భావోద్వేగాలను తెరమీద ఆవిష్కరించడంలో నాగచైతన్య ఒక మెట్టు ఎక్కాడు. ఈ చిత్రం ద్వారా నాగచైతన్య నటుడిగా తన స్థాయిని ఇంకా పెంచుకున్నాడు. చైతూ కెరీర్‌లో రేవంత్ పాత్ర ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నాగచైతన్య, సాయిపల్లవి మధ్య డైలాగ్స్ కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉంది. సీనియర్ యాక్ట్రెస్ ఈశ్వ‌రీ రావు ప‌ర్‌ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇకపోతే సాయిపల్లవి డ్యాన్స్‌ను మ్యాచ్ చేసేందుకుగాను నాగచైతన్య డ్యాన్స్‌పైన బాగానే ఫోకస్ చేసినట్లు అర్థమవుతుంది. సినిమాలో చైతూ జుంబా ‍ డ్యాన్సర్‌గా కనిపించడం, తెలంగాణ యాస టచ్‌ చేయడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

love story movie review

love story movie review

టెక్నీషియ‌న్స్ పని తీరు  Love Story Movie Review

‘లవ్ స్టోరి’ మూవీ టైటిల్‌కు తగ్గట్లు ప్రేమ కథ చుట్టూ తిరుగుతూ పలు అంశాలను చర్చించింది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అయితే ఇంతకు ముందు ఏ సినిమాలో లేని విధంగా చిత్రీకరించారు. పవన్ మ్యూజిక్ ఆద్యంతం అలరిస్తుంది. ఇక ఎప్పటిలాగే శేఖర్ కమ్ముల సినిమాలోని ప్రతీ సీన్ హృద్యంగా తీశాడు. వినోదంతో పాటు భావోద్వేగాలను జోడించి తెరపైన చక్కగా ఆవిష్కరించాడు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ వల్ల అందరూ అత్యద్భుతంగా కనబడుతున్నారు. ఎడిటింగ్ కూడా బాగుంది.

ఫైనల్ వర్డ్:

love story movie review

love story movie review

సాయిపల్లవి, నాగచైతన్య ఈ సినిమాకు బలం అని చెప్పొచ్చు. నాగచైతన్య కంటే కూడా సాయిపల్లవి పాత్రనే కొంచెం ఎక్కవ పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రగా నిలిచింది. పవన్ సీహెచ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. శేఖర్ కమ్ముల తాను ఎంచుకున్న పాయింట్‌ని చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేస్తూ ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచే ప్ర‌య‌త్నం చేశాడు.

ప్ల‌స్ పాయింట్స్:
నాగ చైత‌న్య‌,
సాయి ప‌ల్ల‌వి,
ప‌వ‌న్ సంగీతం

మైన‌స్ పాయింట్స్:
స్లో నరేషన్

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది