Hi Nanna Movie Review : నాని హాయ్ నాన్న మూవీ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hi Nanna Movie Review : నాని హాయ్ నాన్న మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Hi Nanna Movie Review : హాయ్ నాన్న మూవీ రివ్యూ  హాయ్ నాన్న.. సినిమా పేరే వెరైటీగా ఉంది కదా. హాయ్ అంటూ మనం చాలామందిని కలిసినప్పుడు వాడే పదం ఇది. తండ్రికి హాయ్ అని మనం ఎప్పుడూ చెప్పం. కానీ.. ఈ సినిమాకు మాత్రం హాయ్ నాన్న అని టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే మాత్రం సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఈ మధ్య నాని సినిమా పేర్లన్నీ వెరైటీగా ఉంటున్నాయి. హాయ్ నాన్న […]

 Authored By gatla | The Telugu News | Updated on :7 December 2023,2:00 am

ప్రధానాంశాలు:

  •  Hi Nanna Movie Review : నాని హాయ్ నాన్న మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

  •  హాయ్ నాన్న.. సినిమా పేరే వెరైటీగా ఉంది కదా

  •  కూతురు పాత్రలో ఒదిగిపోయిన కియారా

Cast & Crew

  • Hero : నాని
  • Heroine : మృణాల్ ఠాకూర్
  • Cast : బేబీ కియారా ఖన్నా, శృతి హాసన్, జయరామ్‌, అంగద్‌ బేడీ
  • Director : శౌర్యువ్
  • Producer : సీవీ మోహన్, విజెందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్
  • Music : హేషమ్ అబ్దుల్ వహాబ్
  • Cinematography : సాను జాన్ వర్గీస్

Hi Nanna Movie Review : హాయ్ నాన్న మూవీ రివ్యూ  హాయ్ నాన్న.. సినిమా పేరే వెరైటీగా ఉంది కదా. హాయ్ అంటూ మనం చాలామందిని కలిసినప్పుడు వాడే పదం ఇది. తండ్రికి హాయ్ అని మనం ఎప్పుడూ చెప్పం. కానీ.. ఈ సినిమాకు మాత్రం హాయ్ నాన్న అని టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే మాత్రం సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఈ మధ్య నాని సినిమా పేర్లన్నీ వెరైటీగా ఉంటున్నాయి. హాయ్ నాన్న సినిమాకు ముందు దసరా సినిమాతో అలరించాడు. మాస్ ఆడియెన్స్ కోసం నాని ఈ సినిమాలో నటించారు. దసరా సినిమాలో నాని చాలా వెరైటీ లుక్ తో కనిపించాడు. ఆ తర్వాత నాని తీస్తున్న మూవీ హాయ్ నాన్న. ఈ సినిమాలో నానికి జంటగా సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 7న విడుదల అయింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు, ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోలు వేశారు. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. నిజానికి ఈ సినిమాలో నానికి కూతురుగా నటించిన బేబి కియారా పాత్ర చాలా ముఖ్యమైనది. కథ మొత్తం తన చుట్టూనే నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉన్నాయి. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదలవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే నాని తొలి పాన్ ఇండియా మూవీ అని చెప్పుకోవచ్చు.

వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను సీవీ మోహన్, విజెందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మించారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. శౌర్యువ్ దర్శకత్వం వహించారు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీలో శృతి హాసన్ కీలక పాత్రలో నటించారు. జయరామ్, అంగద్ బేడీ ముఖ్య పాత్రల్లో నటించారు. శృతిహాసన్, నాని ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఓడియమ్మ సాంగ్ అయితే సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో నాని హెయిర్ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నాని హెయిర్ స్టయిల్ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు నాని ఎప్పుడూ ట్రై చేయని హెయిర్ స్టయిల్ అది. అది నానికి కరెక్ట్ గా సెట్ అయింది. ఇది పూర్తిగా క్లాస్ క్యారెక్టర్.

Hi Nanna Movie Review : కథ ఇదే

ఇది ఒక ప్యూర్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఒక తండ్రి కూతురు మధ్య ఉండే ప్రేమను, అలాగే ఓ జంట మధ్య ఉండే లవ్ స్టోరీని బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. ఎమోషనల్ లవ్ స్టోరీ మాత్రమే కాదు.. బ్యూటిఫుల్ ఫ్యామిలీ లవ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నాని పేరు విరాజ్. ఇక.. నాని కూతురు భవిష్యత్తు నుంచి గతంలోకి వస్తే ఎలా ఉంటుంది.. టైం ట్రావెల్ తో భవిష్యత్తు నుంచి గతంలోకి కూతురు వస్తే.. అప్పుడు ఆ కూతురు, నాన్న మధ్య జరిగిన ఘటనలే ఈ సినిమా స్టోరీ. విరాజ్ ముంబైలోనే ఫేమస్ ఫోటో గ్రాఫర్. విరాజ్ కు ఒక కూతురు ఉంటుంది. తన పేరు మహీ. తనకు ఆరేళ్లు. మహీగా బేటి కియారా ఖన్నా నటించింది. మహీ అంటే విరాజ్ కు ప్రాణం. ఎంతలా అంటే.. తను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అయితే.. మహీకి పుట్టినప్పుడే ఒక భయంకరమైన వ్యాధి సోకుతుంది. దాని వల్ల మహీ ఎప్పుడు చనిపోతుందో తెలియదు. అందుకే తనను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు విరాజ్. మహీకి రోజూ నిద్ర రాకపోతే తనకు మంచి కథలు చెప్పి నిద్రపుచ్చుతాడు విరాజ్. అలా చాలాసార్లు కేవలం నాన్న ఉన్న కథలే చెప్పేవాడు విరాజ్. తను చెప్పే కథల్లో అస్సలు అమ్మ కూడా ఉండేది కాదు. దీంతో ఎందుకు అమ్మ లేని కథలను చెబుతున్నావు. నాకు అమ్మ ఉన్న కథలే కావాలి అంటూ మహీ మొండికేస్తుంది. అయినా కూడా మహీకి అమ్మ ఉన్న కథలు చెప్పడు విరాజ్. దీంతో మహీకి కోపం వచ్చి ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది.

రోడ్డు మీద వెళ్తుండగా సడెన్ గా మహీని ఓ వాహనం ఢీకొనబోతుంది. అదే సమయంలో యష్ణ వచ్చి కాపాడుతుంది. యష్ణగా మృణాల్ ఠాకూర్ నటించింది. వెంటనే విరాజ్ కు ఫోన్ చేసి మహీని అతడికి అప్పగిస్తుంది. అప్పుడే ఇక.. తప్పని సరి పరిస్థితుల్లో మహీకి విరాజ్ అమ్మ కథను చెబుతాడు. ఆ కథ లో ఉన్న అమ్మ వర్ష ఎవరు అనేది పెద్ద సస్పెన్స్. అయితే.. ఆ కథలో అమ్మగా యష్ణను ఊహించుకుంటుంది మహీ. అయితే ఆ అమ్మ కథను కూడా విరాజ్ సగం వరకే చెప్పి వదిలేస్తాడు. వర్ష అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు విరాజ్. అసలు ఆమె ఎవరు.. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత మహీ పుట్టిన తర్వాత తనకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత విరాజ్, మహీ ఇద్దరినీ వదిలేసి వర్ష వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది విరాజ్ చెప్పడు. అసలు.. ఎందుకు వర్ష వాళ్లను వదిలేసి వెళ్లిపోయింది. అసలు వర్ష ఎవరు? వర్షకు యష్ణకు ఉన్న సంబంధం ఏంటి.. అనేది తెలియాలంటే హాయ్ నాన్న సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

Hi Nanna Movie Review : విశ్లేషణ

ఈ సినిమాలో నాని నటన అదుర్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా మొత్తాన్ని నాని తన భుజాల మీద మోశాడు. ఇక మృణాల్ ఠాకూర్ కూడా అదరగొట్టేసింది. తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తన చిరునవ్వుతో కుర్రాళ్లకు మతి పోగొట్టేసింది. ఇద్దరూ బాగా నటించారు. ఇద్దరి జోడి బాగుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు కంట తడి పెట్టకుండా థియేటర్ నుంచి బయటికి రాలేరు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సమయమా, గాజు బొమ్మ లాంటి పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ ఈ సినిమాకే హైలెట్ అని చెప్పుకోవచ్చు. సినిమాకు వెళ్లిన ప్రతి ఒక్కరు అయితే సినిమా చూసి ఏడవకుండా ఉండలేరు. ఈ సినిమా ముందు రొటీన్ గా అనిపిస్తుంది కానీ.. ఆ తర్వాత వచ్చే ట్విస్టులతో సినిమా కథ మొత్తం మారిపోతుంది. అస్సలు ప్రేక్షకులు ఇలాంటి ట్విస్టులను ఏ సినిమాలో కూడా చూసి ఉండరు. ఆ ట్విస్ట్ చూశాక అప్పుడు అసలు కథ ప్రారంభం అవుతుంది. నిజానికి ఈ సినిమా కథ పాతదే అయినప్పటికీ.. ఆ కథను కొత్తగా చెప్పడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు అనే చెప్పుకోవాలి. అందుకే ఇది ఒక ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అయింది.

ప్లస్ పాయింట్స్

నాని, మృణాల్, కియారా పర్‌ఫార్మెన్స్

సెంటిమెంట్ సీన్లు

జయరామ్ పాత్ర

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

స్లో నెరేషన్

స్పూన్ ఫీడింగ్ సీన్లు

Rating :

3/5

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది