Operation Valentine Movie Review : ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Operation Valentine Movie Review : ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Operation Valentine Movie Review : కొణిదల వారి హీరో వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ విడుదలకి ముందు రివ్యూ వచ్చేసింది? ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్పెషల్ షో ఈ మూవీ బాల్కోట్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ది బెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’అని వైమానిక దళం అధికారులు తమ మూవీ బృందాన్ని మెచ్చుకున్నారని వరుణ్ తేజ్ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొందరి స్పెషల్ షోను వేయడం జరిగింది. ఈ మూవీ చూడగానే […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 February 2024,10:30 pm

ప్రధానాంశాలు:

  •  Operation Valentine Movie Review : ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Operation Valentine Movie Review : కొణిదల వారి హీరో వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ విడుదలకి ముందు రివ్యూ వచ్చేసింది? ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్పెషల్ షో ఈ మూవీ బాల్కోట్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ది బెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’అని వైమానిక దళం అధికారులు తమ మూవీ బృందాన్ని మెచ్చుకున్నారని వరుణ్ తేజ్ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొందరి స్పెషల్ షోను వేయడం జరిగింది. ఈ మూవీ చూడగానే కళ్ళు జలదరించడం పక్క అంటూ రివ్యూస్ వస్తున్నాయి.. ఈ ఆపరేషన్ వాలెంటైన్ కు దర్శకత్వం శక్తి ప్రతాప్ సింగ్ వహించారు. సందీప్ ముద్ద రిలైన్స్ పిక్చర్ ప్రొడ్యూసర్ గా చేశారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ జరిగింది.

అలాగే నందకుమార్ అభినేని తో నిర్మాతలు ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ వరుణ్ తేజ్ సరసన నటించింది. ఈ మూవీ తెలుగు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 1న రిలీజ్ చేయనున్నారు.. పుల్వమా ఘటనపై వచ్చిన బెస్ట్ సినిమా… పుల్వామాలో ఫిబ్రవరి 14, 2019న సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారతీయ వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా ఈ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందుకని, సినిమా స్టోరీ వర్క్ దగ్గర నుంచి ఎయిర్ ఫోర్స్ అధికారుల సలహాలు, సూచనలతో పాటు వాళ్ల అనుమతులు తీసుకున్నారు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. సినిమా పూర్తి అయ్యాక వాళ్లకు సినిమా చూపించారు.వరుణ్ తేజ్ మాట్లాడుతూ…

”ఎయిర్ ఫోర్స్ అధికారులకు సినిమా చూపించాం. ఇప్పటి వరకూ పుల్వామా ఘటనపై వచ్చిన సినిమాల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్ ది బెస్ట్ మూవీ’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు” అని చెప్పారు. ప్రతి భారతీయుడు సినిమా చూసి ఎమోషనల్ అవుతారని, ఆ భావోద్వేగాలతో కనెక్ట్ అవుతారని ఆయన చెప్పారు.ఆపరేషన్ వాలెంటైన్ పేరు ఎందుకు పెట్టామంటే? సినిమా టైటిల్ గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ… ”పుల్వామా ఘటన ఫిబ్రవరి 14న జరిగింది. అదే రోజున మన ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. వాలెంటైన్ డే రోజున శత్రువులకు రిటర్న్ గిఫ్ట్‌గా ఈ ఎటాక్ ప్లాన్ చేశారు. మా సినిమా వరకు వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద ఉన్న ప్రేమ” అని తెలిపారు.

కథ విషయానికొస్తే…

ఆపరేషన్ వాలంటైన్ సినిమా కథ విషయానికొస్తే వరుణ్ తేజ్ ( అర్జున్ రుద్రదేవ్ ) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వాడ్రన్ లీడర్. ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కొని నిలబడగలిగే వ్యక్తి. అయితే ఇతను ఎయిర్ ఫోర్సులో పనిచేసే రాడార్ ఆఫీసర్ అహానాగిల్ , ( మానుషి చిల్లర్ ) తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే డిఫెన్స్ వారు ఆపరేషన్ వజ్ర ను మొదలు పెడతారు. అయితే ఆ మిషన్ విఫలం అవడంతో రుద్రదేవ్ కు తీవ్ర గాయాలు అవుతాయి. ఇక అక్కడినుండి బయటపడిన తర్వాత మెల్లిగా కోలుకుంటాడు. అనంతరం జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్టులు బస్సులో వెళుతున్న మన దేశ సైనికుల ప్రాణాలను తీస్తారు.ప్రేమికుల దినోత్సవం రోజు ఈ ఘాతూకానికి పాల్పడతారు. దీంతో ఎలాగైనా సరే వారు చేసిన పనికి తిరిగి సమాధానం ఇవ్వాలని భారతీయ వైమానిక దళం ఆపరేషన్ వాలంటైన్ పేరుతో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆపరేషన్ రుద్రదేవ్ ముందుండి నడిపిస్తాడు. ఇక ఈ ఆపరేషన్ లో ఏం జరిగింది…చివరివరకు ఆపరేషన్ వజ్ర సక్సెస్ అవుతుందా లేదా అనేది సినిమాలో చూపించడం జరిగింది. ఇక ఇవన్నీ తెలియాలంటే తెరపై ఆపరేషన్ వాలంటైన్ సినిమా చూడాల్సిందే.

కథనం , విశ్లేషణ…

మన భారతదేశంలో ఫిబ్రవరి 14 2019లో జరిగిన అతి పెద్ద ఘాతుకాన్ని తెరపై చూపించడం అనేది ఆశామాసి విషయం కాదు. ఈ కుట్ర వెనుక ఉన్న ప్రత్యర్ధ దేశం పాకిస్తాన్ ఈ వ్యూహానికి ఎలా రచన చేసింది. అనంతరం పాక్ విసిరిన సవాలను మన దేశం ఎలా ఎదుర్కొంది అనే విషయాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. అలాగే 2019 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజు మనదేశంలో బ్లాక్ డే గా పరిగణిస్తారు. ఇదే రోజు దాదాపు మన దేశానికి చెందిన 40 జవాన్లను పాకిస్తాన్ కి చెందిన ముష్కరులు బాంబుదాడితో బలిగొన్నారు. దీంతో మన దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలాంటి ఘటనను డైరెక్టర్ తెరపై చక్కగా చూపించారు. ఇక ఇలాంటి సినిమాలు తెరపై చూపించాలంటే ఆ సమయంలో ఏం జరిగిందనే విషయాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.అదేవిధంగా డిఫెన్స్ అధికారుల సహాయ సహకారాలు కూడా కచ్చితంగా కలిగి ఉండాలి. ఇక ఫస్ట్ ఆఫ్ హీరో హీరోయిన్ రొమాన్స్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ తేజ్ నటన పలు రకాల సన్నివేశాలు చాలా అద్భుతంగా చూపించారు. దేశం గర్వించే స్థాయికి ఎదగాలంటే బలమైన నాయకుడే కాదు ఆనాయకుడి ఆదేశాలను సక్రమంగా అమలు చేసే సైనికులు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే హీరో వరుణ్ తేజ్ పాత్రను రూపొందించడం జరిగింది. ఇక దేశభక్తి విషయానికొస్తే ముఖ్యంగా ఆర్మీకి సంబంధించిన వారి స్టోరీలనే తెరకెక్కించడం జరుగుతుంది. కానీ మనదేశంలో ఆర్మీతో పాటు న్యావి ఎయిర్ ఫోర్స్ వంటివి కూడా కీలకపాత్ర పోషిస్తాయనే విషయాన్ని స్పష్టంగాతెలియజేశారు.

అదేవిధంగాఎయిర్ ఫోర్స్ సహాయంతో 1971లో పాకిస్తాన్ తో యుద్ధం జయించిన విషయాన్ని కూడా ఈ సినిమాలో ప్రజలకు తెలిసేలా చేశారు. అలాగే దీనిలో పుల్వామా ఎటాక్ ఆ తర్వాత మన దేశం బాలా కోట్ పై సర్జికల్ స్ట్రైక్ చేయడం , తర్వాత పాకిస్తాన్ కు చెందిన ఎయిర్ ఫోర్స్ మన దేశ వైమానిక దళాలపై ఎట్టాక్ చేయడం , దానిని మన దేశ సైనికులు ఎలా ఎదుర్కొన్నారు అని వాటిని తెరపై చాలా అద్భుతంగా చూపించారు. అయితే సినిమా మొత్తం పూర్తిగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే కమర్షియల్ అంశాలకు దూరంగా చాలా న్యాచురల్ గా తీశారు. ఇక ఈ సినిమా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రియల్ స్టోరీ ని తెరపై చూపించడంలో ఎంత కష్టపడ్డారో ఖచ్చితంగా కనిపిస్తుంది.

నటీనటుల విషయానికొస్తే…

వరుణ్ తేజ్ ఒకదానికి పరిమితం కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అలరించాడు. స్వాడ్రన్ లీడర్ రుధ్ర ప్రతాప్ సింగ్ పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ మానుషి చిల్లర్ కూడా తన వంతు మెప్పించగలిగింది. ఇతర పాత్రలో నటించిన నటీనటులు కూడా వారి పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్…

కథ , డైరెక్షన్ , యాక్షన్ సీక్వెన్స్

మైనస్ పాయింట్స్…

ఫస్టాఫ్ , చాలా సీరియస్ గా సాగే స్టోరీ , కమర్షియల్ అంశాలు.

రేటింగ్…

3/5

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది