Game Changer Public Talk : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ అండ్ పబ్లిక్ టాక్.. మూవీలో చిన్న మార్పులు..?
ప్రధానాంశాలు:
Game Changer Public Talk : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పబ్లిక్ టాక్.. మూవీలో చిన్న మార్పులు..?
Game Changer Public Talk : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో Game Changer Review భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. మెగా ఫ్యాన్స్ ఆహా ఓహో అనేస్తున్నా కామన్ ఆడియన్స్ సినిమా రొటీన్ కథే కానీ కొన్ని మెరుపులు బాగున్నాయని అంటున్నారు. ఐతే శంకర్ రీసెంట్ గా తీసిన సినిమాల కన్నా బెటర్ అని అంటున్నారు. శంకర్ డైరెక్షన్ లో ఒకప్పుడు వచ్చిన జెంటిల్మన్, ఒకే ఒక్కడు సినిమా తరహాలో ఈ సినిమాను ఊహించుకున్నారు. ఐతే సినిమాలో మేజర్ హైలెట్స్ లో కథ ఒకటి అని అనుకున్నా ఐతే ఇలాంటి కథలు చాలా చూశామన్న భావన కలుగుతుంది. ఐతే శంకర్ తన మార్క్ అయితే చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా విజువల్ గా సినిమా గ్రాండియర్ నెస్ తెలుస్తుంది.
Game Changer Public Talk : అప్పన్న పాత్రలో రామ్ చరణ్ మైండ్ బ్లాక్..
పెట్టిన ప్రతి పైసా తెర మీద కనిపిస్తుంది. సాంగ్స్ కూడా సూపర్ అనేస్తున్నారు పబ్లిక్. ఐతే కథ మీద ఇంకాస్త వర్క్ చేసి ఉండాల్సింది అంటున్నారు. రామ్ చరణ్ అయితే రెండు పాత్రల్లో అదరగొట్టాడని చెబుతున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో రామ్ చరణ్ మైండ్ బ్లాక్ చేశాడని చెప్పుకుంటున్నారు. సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సపోర్ట్ చేసింది. ఐతే సినిమా కోసం నానా హైరానా సాంగ్ 10 కోట్ల వ్యయంతో తీయగా అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల యాడ్ చేయలేదు. జనవరి 14 నుంచి ఆ సాంగ్ వస్తుందని తెలుస్తుంది. ఓవరాల్ గా రాం చరణ్ ఎఫర్ట్స్, శంకర్ మార్క్ టేకింగ్ గేమ్ ఛేంజర్ ని నిలబెట్టాయనే చెప్పొచ్చు. పబ్లిక్ కూడా అదే రెస్పాన్స్ అందిస్తున్నారు.
ఐతే యాంటీ ఫ్యాన్స్ మాత్రం సినిమా పోయిందని ట్రోల్స్ మొదలు పెట్టారు. కామన్ ఆడియన్స్ సినిమాకు థంస్ అప్ చెప్పేస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ 400 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ టాక్ తో సినిమా ఎంత వసూళ్లు చేస్తుంది అన్నది చూడాలి.
ఇక్కడ క్లిక్ చేయండి ===> Game Changer Review : గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!