RRR Movie Review : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఫస్ట్ రివ్యూ వ‌చ్చేసింది..!

 Authored By mallesh | The Telugu News | Updated on :30 December 2021,11:40 am

RRR Movie Review: టాలీవుడ్ జక్కన్న, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా, ఈ పిక్చర్ రిలీజ్ కాక ముందే అప్పుడే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సెన్సార్ బోర్డు సభ్యులతో కలిసి తాను మూవీ చూశానని, ఈ సినిమాకు ఆత్మ ఆ హీరో మాత్రమేనని ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రజెంట్ బాగా వైరలవుతోంది. సదరు వ్యక్తి పోస్ట్‌పై రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..తెలుగు సినిమాలు విడుదల కాక ముందే ఇలా రివ్యూలు చెప్పే వారిలో ఒకరు సునిశిత్. కాగా, ఆయన్ను మించిపోయి రివ్యూలు ఇచ్చేస్తుంటాడు ఉమైర్ సంధు అనే స్వయం ప్రకటిత యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్.

ఉమైర్ సింధు..తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు మెంబర్ సభ్యుడినని చెప్పుకుంటుంటాడు. ఈ క్రమంలోనే గతంలో ఆయన పిలు సినిమాలకు రివ్యూ ఇచ్చాడు. కాగా, ఆయన చెప్పినవి జరగవు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం చర్చనీయాంశం అవుతుంటాయి.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు, అజ్ఞాతవాసి’, మహేశ్ బాబు ‘స్పైడర్’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రాలకు బ్లాక్ బాస్టర్ అంటూ రివ్యూ ఇచ్చేశాడు ఉమైర్ సింధు. కాగా, ఆయన పేర్కొన్న దానికి భిన్నంగా రిజల్ట్స్ ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘83’ మూవీ డిజాస్టర్ అని తేల్చేశాడు ఉమైర్.

rrr movie review by umair sandhu

rrr movie review by umair sandhu

RRR Movie Review : సినిమాకు ఎంత రేటింగ్ ఇచ్చాడంటే..

కానీ, ఆ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని సక్సెస్ దిశగా ముందుకు సాగుతోంది. ఇకపోతే తాజాగా ఈ స్వయం ప్రకటిత సెన్సార్ బోర్డు మెంబర్ ‘ఆర్ఆర్ఆర్’ఫిల్మ్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. కాగా, ఆయన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టును నెటిజన్లు, రామ్ చరణ్ అభిమానులు తప్పుబడుతున్నారు.తాను సెన్సార్ బోర్డు సభ్యులతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చూస్తున్నానని ట్విట్టర్ వేదికగా ఉమైర్ సింధు ట్వీట్ చేశాడు.

దాంతో నెటిజన్లు ఉమైర్ సంధును ఆటాడుకుంటున్నారు. ఇకపోతే ఉమైర్ సంధు చేసిన మరో ట్వీట్ కూడా వివాదాస్పదంగా ఉంది. సినిమా ఆత్మ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని ఉమైర్ సంధు పేర్కొన్నాడు. దాంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులు ఉమైర్ సంధుపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఉమైర్ సంధును ట్రోల్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్ సినిమాను తమరు ఇప్పుడెలా చూస్తారు, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తాం, వేసేయ్ రా ఫైవ్ స్టార్స్ రేటింగ్, సొల్లుగాడు, నిన్ను అస్సలు సెన్సార్ బోర్డు సభ్యులు ఎందుకు పిలుస్తారు, చెత్త రివ్యూలు ఇస్తే పగిలిపోద్ది’ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉమైర్ సంధుకు సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారు. ఉమైర్ సంధు ఫేక్ రివ్యూగాడని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి