Squid Game 2 Review : స్క్విడ్ గేమ్ సీరీస్ 2 సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Squid Game 2 Review : స్క్విడ్ గేమ్ సీరీస్ 2 సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్..!
నటీనటులు: లీ జంగ్ జే-వి హా జున్-లీ బ్యుంగ్ హున్ తదితరులు
డైరెక్టర్ : హ్వాంగ్ డాంగ్ హ్యుక్
రిలీజ్ : నెట్ ఫ్లిక్స్
ఎపిసోడ్స్ : 7
Squid Game 2 Review : వరల్డ్ వైడ్ గా కొరియన్ సీరీస్, సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. అక్కడ వారు తీసే కొత్త కాన్సెప్ట్ సినిమాలు, సీరీస్ లు వెరైటీగా ఉంటాయి. అంతకుముందు అక్కడ నుంచి వచ్చిన పారసైట్ సినిమా సంచలన విజయం అందుకోగా ఆ తర్వాత వెబ్ సీరీస్ గా వచ్చిన స్క్విడ్ గేమ్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఊర్రూతలూగించింది. ఉత్కంఠతతో ఈ సీరీస్ మొత్తం అదరగొట్టగా ఈ సీరీస్ కు సీక్వెల్ గా స్క్విడ్ గేమ్-2 వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో తాజాగా రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.
కథ : అప్పులు పాలై జీవితం మీద ఆశ వదులుకున్న వారిని ఎంచుకుని ఒక దీవికి తీసుకెళ్లి అక్కడ పిల్లల ఆటలని చెప్పి డేంజర్ గేమ్స్ ఆడిస్తుంటారు. ఈ ఆటల్లొ ఓడటం అంటే మరణించడం అన్నట్టే. ఆటలో ఓడిన వారి ప్రాణాలు తీసి ఆనందం పొందుతారు. అలా 600 మంది తో మొదలు పెట్టే ఈ ఆటలో చివరకు సియాంగ్ జి హున్ (లీ జంగ్ జే) మాత్రమే చివరి వరకు ఉంటాడు. అతనికి 40 బిలియన్ వాన్లు అంటే 230 కోట్లు ప్రైజ్ మనీ అందిస్తారు. ఐతే ఆ డబ్బుతో అతను సాటిస్ఫై అవ్వడు. ఐతే బయటకు వచ్చిన అతను ఈ డేంజర్ గేమ్ ఆపేయాలని అనుకుంటాడు. అందుకు అతనేం చేశాడు అన్నది ఈ సీరీస్ కథ.
Squid Game 2 Review విశ్లేషణ :
స్క్విడ్ గేమ్ పార్ట్ 1 టైం లో ఎలాంటి అంచనాలు లేవు కాబట్టి ఆడియన్స్ అంతా సీరీస్ చూస్తున్నంత సేపు చాలా ఎగ్జైట్ అయ్యారు. ముఖ్యంగా ఆ కాన్సెప్ట్ అంతా కొత్తగా ఉండటం స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ తో అదిరిపోతుంది. ఐతే పార్ట్ 2 కథ కొంతమేరకు గెస్ చేసే అవకాశం ఉంది కానీ ఎలా నడిపిస్తారు అన్నది ఉత్సుకత ఉంది. ఐతే అనుకున్న రేంజ్ లో లేకపోయినా కొన్ని పోర్షన్స్ లో స్క్విడ్ గేమ్ 2 కూడా ఆకట్టుకుందని చెప్పొచ్చు.
కొత్తగా చెప్పినప్పుడు ప్రతీది క్యూరియస్ గా ఉంటుంది. కానీ ఆల్రెడీ కాన్సెప్ట్ తెలిశాక ఒక రేంజ్ లో ఉంటేనే కానీ థ్రిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. అందుకే స్క్విడ్ గేమ్ పార్ట్ 1 సూపర్ హిట్ అయ్యింది కాబట్టి పార్ట్ 2 దానికి మించి ఉండాలని అనుకుంటారు. ఐతే బోర్ కొట్టకుండా ఈ పార్ట్ 2 ని కొనసాగించినా అక్కడక్కడ ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది.
ముఖ్యంగా స్క్రీన్ ప్లే లో వేగం తగ్గడం డిజప్పాయింట్ చేస్తుంది. పార్ట్ 1 లా క్షణ క్షణం టెన్షన్ అనిపించదు. ఆటలో ఏం జరుగుతుంది అన్న ఎగ్జైట్ మెంట్ కూడా అంతగా అనిపించదు. ఆట మొదలు పెట్టాక మరీ ఉత్కంఠ భరితం ఉండదు కానీ పర్వాలేదు అన్నట్టుగా వెళ్తుంది. ఈ సీజన్ లో ఓటింగ్ అంటూ కొత్త వ్యవహారం పెట్టారు. అది కాస్త లెంగ్తీగా అనిపించింది. కొన్ని ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ఉన్నా స్క్విడ్ గేమ్ 2 కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. ఐతే చివర్లో మళ్లీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు.
స్క్విడ్ గేమ్ 2 చూసిన వారికి సంతృప్తి అనిపించినా ఎక్కడో ఒక చోట ఏదో మిస్ అయ్యిదన్న ఫీలింగ్ ఉంటుంది. స్క్విడ్ గేమ్ 2 బోర్ అనిపించదు కానీ పార్ట్ 1 తో పోల్చితే మాత్రం కాస్త తగ్గినట్టు ఉంటుంది.
బాటం లైన్ :
స్క్విడ్ గేమ్ 2 ఆటని సాగదీసినా అదరగొట్టేశారు..!
రేటింగ్ : 2.5/5