Chandra babu పవన్ తప్పు చేశాడని నిరూపించండి .. వైసీపీ నాయకులపై మండిపడ్డ చంద్రబాబు నాయుడు..
Chandra babu తాజాగా నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది అవినీతి రాజకీయం, డబ్బులతో రాజకీయం చేస్తున్నారు. బెదిరించడం కేసులు పెట్టడం ఇవి తప్ప రాష్ట్రంలో ఏమి జరగటం లేదు. వైయస్సార్ సీపీ దరిద్రపు పార్టీ. రాజకీయ పార్టీకి అర్హత లేని పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైయస్సార్ సిపి పార్టీనే. రాజకీయాలలో అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర […]
ప్రధానాంశాలు:
పవన్ తప్పు చేశాడని నిరూపించండి
Chandra babu serious on CM Jagan
వైసీపీ నాయకులపై మండిపడ్డ చంద్రబాబు నాయుడు
Chandra babu తాజాగా నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది అవినీతి రాజకీయం, డబ్బులతో రాజకీయం చేస్తున్నారు. బెదిరించడం కేసులు పెట్టడం ఇవి తప్ప రాష్ట్రంలో ఏమి జరగటం లేదు. వైయస్సార్ సీపీ దరిద్రపు పార్టీ. రాజకీయ పార్టీకి అర్హత లేని పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైయస్సార్ సిపి పార్టీనే. రాజకీయాలలో అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎటువంటి నిబంధనలు అడ్డాకులు కలిగించలేదు. కానీ ఇప్పుడు ఆయన టిడిపి పార్టీ పాదయాత్ర చేస్తుంటే నిబంధనలు పెడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. రఘురామరెడ్డి ఆర్డర్ వేస్తే వైఎస్ఆర్సిపి నాయకులు ఫాలో అవుతారు. ఇంటిలిజెంట్ ఆఫీసర్ సీతారామాంజనేయులు అందరి మీద కేసులు పెడుతూ రిపోర్ట్ లు ఇస్తు ఉంటారు.
చట్ట ప్రకారం పాదయాత్ర పెట్టవచ్చు మీటింగులు పెట్టవచ్చు. మన రాష్ట్రంలో మీటింగ్లు పెట్టనివ్వడం లేదు , మీడియాను స్వేచ్ఛగా రాయనివ్వడం లేదు. ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే వారికి మాత్రం స్వేచ్ఛ లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు చాలామందిని చూశాను. ముఖ్యమంత్రి ప్రజలను చూసి భయపడతాడు. ప్రతిపక్ష పార్టీలు విలువ ఇస్తాయి. జగన్మోహన్ రెడ్డికి అవేమీ లేవు. వివేకానంద రెడ్డి హత్య కూడా వీళ్లే చేసి నాటకాలు ఆడుతున్నారు. అమరావతిలో ఎన్ని కుప్పిగంతులు వేశారో మీకే తెలుసు. ఇవన్నీ చూశాక ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఒక్క వ్యక్తి కూడా ఓటు వేయడానికి అర్హత లేని పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ.
జీవో1 ను ఎవరి తెమ్మన్నారు. దీని వలన కాకినాడలో 9 మంది చనిపోయారు. ఫ్యాక్టరీలు మూసేయమని జగన్ కి చెబుతున్నాను. ప్రశాంతంగా పాదయాత్ర జరుగుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు అడ్డుపడుతున్నారు. ఎవరిచ్చారు ఈ అధికారం .. ఎందుకు ఈ అహంకారం. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. జగన్ పాదయాత్ర చేశాడు కానీ మేము అడ్డుకోలేదు. ప్రజలు ఆలోచించాలి. ఎవరికోసం పాదయాత్రలు చేసేది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అడిగితే వాళ్ల మీద విరుచుకుపడ్డారు. ఎన్ని నిబంధనలు పెట్టిన నన్నేమీ చేయలేరు. ఆ పార్టీ నుంచి ఎవరి పోయినా మేము దాడులు చేయలేదు. కాని వారు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. మా ఫోన్లను టాపింగ్ చేస్తున్నారు. మేము ఎక్కడికి పోతున్నామో, ఏం చేస్తున్నామో తెలుసుకోవడమే వాళ్ళ పని అని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇక మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టీడీపీ తో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీలపై దాడి చేసినట్లుగా తెలుస్తుంది.