Tees Maar Khan Movie Review : తీస్‌మార్ ఖాన్ మూవీ ఫస్ట్ రివ్యూ..!
Tees Maar Khan Movie Review : సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఇటీవలి కాలంలో ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఈ క్రమంలో ‘తీస్‌మార్ ఖాన్’ అనే చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యాడు. నాటకం ఫేం కళ్యాణ్ జీ గోగన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన తీస్‌మార్ ఖాన్ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. పూర్ణ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్ ఈ చిత్రంలో కీ రోల్స్‌లో నటించారు. తీస్ మార్ ఖాన్‌కు సాయికార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్. ఆది మరోవైపు ఫణి కృష్ణ దర్శకత్వంలో క్రేజీ ఫెలో సినిమా చేస్తున్నాడు. దిగంగనా సూర్యవంశి, మిర్ణా ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో ఎంటర్‌టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు ఆది సాయికుమార్.
కథ: తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్) అనే ఒక కాలేజ్ స్టూడెంట్ పోలీస్ లాగా అవ్వాలి అనుకుంటాడు. ఆ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. అయితే తీస్ మార్ ఖాన్ తన సోదరిని, తన సోదరి భర్తని కోల్పోతాడు. తర్వాత ఏం జరిగింది? అసలు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? తీస్ మార్ ఖాన్ తనని ఇంత ఇబ్బంది పెట్టిన వారిపై పగ తీర్చుకుంటాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా కూడా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అంశాలు ఉంటాయి. కథ, కథనం పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. ఆది సాయికుమార్ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి.సినిమా మొత్తం ఆది సాయికుమార్, తన సోదరి మధ్య ఉన్న బంధం ఎలాంటిది అనే విషయం మీద నడుస్తుంది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పాత్ర చిత్రీకరించిన విధానం కూడా కమర్షియల్ సినిమా టెంప్లేట్ హీరోయిన్ పాత్రలాగానే ఉంటుంది.
పాటలు కూడా ఏదో సందర్భం లేకుండా వచ్చినట్టు అనిపిస్తుంది. టెక్నికల్ గా సినిమా బాగానే ఉంది. కానీ సినిమాకి ముఖ్యమైన కథ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. రొటీన్ కథ, బోరింగ్ సీన్స్, అవసరం లేకుండా వచ్చే పాటలు, బలహీనమైన కథనం ప్రేక్షకుల కథనాన్ని పరీక్షిస్తాయి.
చివరిగా: ఆది సాయి కుమార్ గత చిత్రాలు మిక్స్ డ్ టాక్ పొందగా, ఈ సినిమా పక్కా హిట్ అవుతుందనే అభిప్రాయంలో ఉన్నాడు. కాని బలహీనమైన కథ, కథనం ప్రేక్షకులని పెద్దగా ఆకర్షించలేకపోయింది. ఈ సినిమా ఆదికి మరొక ఫ్లాప్ చిత్రంగానే మిగిలిపోయింది.
రేటింగ్ : 2.5/5