Waltair Veerayya Movie Review : వాల్తేరు వీర‌య్య మూవీ రివ్యూ అండ్ రేటింగ్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Waltair Veerayya Movie Review : వాల్తేరు వీర‌య్య మూవీ రివ్యూ అండ్ రేటింగ్…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 January 2023,11:00 pm

Waltair Veerayya Movie Review : ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు సంద‌డి చేస్తున్నారు. జ‌న‌వ‌రి 12న వీర‌సింహారెడ్డి విడుద‌ల కాగా, జ‌న‌వ‌రి 13న వాల్తేరు వీర‌య్య చిత్రం విడుద‌లైంది. చాలా ఏళ్ల తరవాత మెగాస్టార్ చిరంజీవి , Megastar Chiranjeevi, Nandamuri Balakrishna, నందమూరి బాలకృష్ణ సంక్రాంతి రేసులో పోటి ప‌డుతున్నారు. అయితే వీరసింహారెడ్డి సినిమాకి మంచి టాక్ సంపాదించుకోగా, ఇప్పుడు వాల్తేరు వీర‌య్య చిత్రం కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ కి ముందే ఓవ‌ర్సీస్ సెన్సార్ బోర్డులో ఇండియన్ సినిమాలు చూస్తానని.. అక్కడి నుంచే రివ్యూలు ఇస్తుంటానని చెప్పే ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చాడు చిరంజీవికి ఇది బెస్ట్ కమ్‌బ్యాక్ అని కొనియాడాడు. రవితేజ, చిరంజీవి, Chiranjeevi, Ravi Teja కాంబో అదిరిపోయిందని.. ఇద్దరూ కలిసి వెండితెరపై అద్భుతం చేశారని స్ప‌ష్టం చేశాడు. ఇదొక మసాలా పాప్‌కార్న్ మూవీ అని అని,

సినిమాకు మంచి కథ, సంగీతం కుదిరాయని అన్నాడు. అలాగే, ఈ సినిమాకు ఉమైర్ సంధు 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అయితే ఉమైర్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఫ్లాప్ అని చెప్పిన సినిమాలు హిట్ అయ్యాయి. మరి వాల్తేరు వీర‌య్య సినిమా,Waltair Veerayya Movie,  ఎలాంటి విజ‌యం సాధిస్తుంద‌నేది మ‌రి కొద్ది గంట‌ల‌లో తెలియ‌నుంది. చిరంజీవి – బాబీ కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రూపొంద‌గా, మైత్రీ మూవీ మేకర్స్,Mythri Movie Makers,  వారు నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ స్వ‌రాల‌కు సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటలకి మంచి రెస్పాన్స్ రాగా, రీసెంట్‌గా వ‌దిలిన ‘నీకేమో అందమెక్కువ .. నాకేమో తొందరెక్కువ పాట కి కూడా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. చిరంజీవి – శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ పాటను విదేశాల్లో చిత్రీకరించ‌గా, స‌న్నివేశాలు ఎంత‌గానో ఆకట్టుకున్నాయి.

Waltair Veerayya movie review and rating in telugu

Waltair Veerayya movie review and rating in telugu

దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా, మీకా సింగ్ .. గీతామాధురి .. వేల్ మురుగన్ ఈ పాటను పాడడారు. గంటల్లోనే ఈ పాటకి 3.4 మిలియన్ వ్యూస్ లభించ‌డం విశేషం. వాల్తేరు వీర‌య్య చిత్రంలో రవితేజ కీలకపాత్రలో కనిపించనుండ‌గా, ఈ సినిమాలో రవితేజ, విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్రలో కనిపించి అల‌రించ‌నున్నాడు.. ఇప్ప‌టికే రవితేజకు సంబంధించిన టీజర్ విడుదలై కేక పెట్టించింది. తెలంగాణ యాసలో ఆయన వావ్ అనిపించి మెప్పించాడు. వాల్తేరు వీరయ్యకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేయ‌గా, ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాలు ఉంది.  మొత్తంగా ఈ సినిమా నిడివి ఎక్కువగానే ఉంది. ఈ సినిమాను బాబీ ఔట్ అండ్ ఔట్

మాస్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కించారు. ఇక‌ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..తెలంగాణ (నైజాం)లో .. రూ. 18 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో.. రూ. 15 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 10.2 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 6.50 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 6.50 కోట్లు.. గుంటూరు.. రూ. 7.50 కోట్లు.. కృష్ణ.. రూ. 5.6 కోట్లు.. నెల్లూరు..రూ. 3.2 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్‌ కలిపి రూ. 72 కోట్లు.. కర్ణాటక .. రూ. 5 కోట్లు.. రెస్టాఫ్ భారత్.. రూ. 2 కోట్లు.. ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లు బిజినెస్ జ‌రిగింది.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ. 89 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఏం చేస్తాడో చూడాలి మ‌రి…

రిలీజ్ డేట్: 13 జనవరి 2023
నటినటులు: చిరంజీవి, శృతిహాసన్, ర‌వితేజ, సుమ‌ల‌త‌, రాజేంద్ర‌ప్ర‌సాద్, వెన్నెల కిషోర్,బాబీ సింహా తదితరులు
డైరెక్టర్: కేఎస్ ర‌వీంద్ర‌
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవి శంకర్
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్ర‌సాద్

మెగాస్టార్ చిరంజీవి ఆరుప‌దుల వ‌య‌స్సులోను ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన వ‌రుస సినిమాల‌తో అల‌రిస్తూనే ఉన్నారు.. పోయిన ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించిన చిరంజీవి ఈ ఏడాది నాలుగు సినిమాలతో రెడీగా ఉన్నారు. ఇందులో చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతికి విడుదల కాగా, ఈ సినిమా ఎలా ఉంది, క‌థేంటి, ప్రేక్ష‌కుల‌కి న‌చ్చిందా లేదా అనేది చూద్దాం..

క‌థ‌:

రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీతో ఈ చిత్రం ప్రారంభం కాగా, వాల్తేరులో ఇండియన్ నేవీ ఆఫీసర్స్ రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది. అంతర్జాతీయ మాఫియా డ్రగ్ లీడర్ సాల్మన్ సీజర్‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌గా,ఈ డ్రగ్ కేసును పోలీసు అధికారి (రాజేంద్ర ప్రసాద్) దర్యాప్తు చేపడుతారు . అయితే వాల్తేరులో ఉన్న‌ వీరయ్య (చిరంజీవి) దర్యాప్తుకు సహకరించడానికి మలేషియా వెళ్తాడు. అక్కడ అతిథి (శృతిహాసన్)తో పరిచయం ఏర్పడి అది ప్రేమ‌గా మారుతుంది. దాంతో వారి మధ్య లవ్ మొదలవుతుంది. ఇక మలేషియాలో డ్రగ్స్ దందాకు వీరయ్యకు ఉన్న సంబంధాలు ఏంటి… ఏసీపీ (రవితేజ)కి, వీరయ్యకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది. డ్రగ్స్ కేసు ఎలాంటి మలుపులకు దారి తీసింది అనేది చిత్ర క‌థ‌.

ప‌ర్‌ఫార్మెన్స్:

వాల్తేరు వీర‌య్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ మాస్ గా ఉంటూ ఆకట్టుకుంది. ఊర్వశి రౌటేలా బాస్ పార్టీ సాంగ్ ఊహించిన‌ట్టుగానే ఉంటుంది. ఈ పాటలో ఊహించినట్లుగానే చిరంజీవి తన డ్యాన్స్ తో ఎంత‌గానో ఆకట్టుకున్నారు. సాంగ్ చిత్రీకరించిన విధానం కూడా బావుంటుంది. శృతి హాస‌న్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు మిగ‌తా న‌టీన‌టుల న‌ట‌న కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మెగాస్టార్ ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చారు. ఆయన లుక్స్, మ్యానరిజమ్స్ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేస్తున్నాయి. ఇది ఫ్యాన్స్కి మంచి ట్రీట్ అని చెప్పాలి.

కథ యావరేజ్ గా ఉన్నప్పటికీ బిట్స్ బిట్స్ గా సన్నివేశాలు మ‌న‌ల్ని ఎంటర్టైన్ చేస్తాయి.చిరంజీవి అభిమాని అయిన బాబీ త‌న‌దైన స్టైల్‌లో సినిమాని తెర‌కెక్కించి ఊపేశాడు. దేవిశ్రీ ప్రసాద్ మంచి బిజియం అయితే అందించారు. వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరంజీవి డ్యాన్స్, రవితేజ సన్నివేశాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పాజిటివ్ అంశాలుగా చెప్పొచ్చు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. కెమెరా ప‌నిత‌నం ,ఎడిటింగ్ వ‌ర్క్‌తో పాటు ఇత‌ర సాంకేతిక వాల్యూస్ కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్

చిరు డ్యాన్స్
ర‌వితేజ సీన్స్
దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం

మైన‌స్ పాయింట్స్:
క‌థ‌
కొన్ని స‌న్నివేశాలు

విశ్లేష‌ణ‌:

మొత్తంగా సంక్రాంతి సీజన్ లో వాల్తేరు వీరయ్య చిత్రం డీసెంట్ మూవీ అని చెప్పాలి. ఫ్యాన్స్ కి ఓకే కానీ కామన్ ఆడియన్స్ కి ఆశించిన స్థాయిలో పూనకాలు లోడింగ్ కాలేదు సినిమా సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ పాత్ర కూడా హైలైట్ కావ‌డం సినిమాకి క‌లిసి వ‌చ్చింది. రవితేజ స్క్రీన్ ప్రజెన్స్ తో పాటు సెంటిమెంట్ వర్కౌట్ ఐంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్నపటికీ సెకండ్ హాఫ్ చిత్రాన్ని నిలబెట్టింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది