AFG VS AUS : వారెవ్వా మ్యాక్స్ వెల్.. నీలో ఇంత సత్తా ఉందా.. రికార్డులకే వణుకు పుట్టించావు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AFG VS AUS : వారెవ్వా మ్యాక్స్ వెల్.. నీలో ఇంత సత్తా ఉందా.. రికార్డులకే వణుకు పుట్టించావు

 Authored By kranthi | The Telugu News | Updated on :8 November 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  128 బంతుల్లో 201 పరుగులు

  •  అదిరిపోయిన ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్

  •  ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించిన మ్యాక్స్ వెల్

AFG VS AUS : అసలు క్రికెట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాలంటేనే చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఏకంగా డబుల్ సెంచరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. రచ్చ రంబోలానే కదా. అవును.. ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో అదే జరిగింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లేన్ మ్యాక్స్ వెల్ చరిత్ర సృష్టించాడు. ఏకంగా చేజింగ్ లో 201 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే చేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన ఫస్ట్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించారు. వన్డేల్లో ఇప్పటి వరకు ఎవ్వరూ డబుల్ సెంచరీ చేయలేదు. అలాగే.. ప్రపంచకప్ లో మాత్రం డబుల్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్ మెన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు మ్యాక్స్ వెల్. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టి 201 పరుగులు చేశాడు. నిజానికి ఆస్ట్రేలియాకు అది ఓడిపోయే మ్యాచ్. అదికూడా పసికూన ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లో ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా బ్యాటింగ్ లోకి దిగిన మ్యాక్స్ వెల్ రచ్చ రచ్చ చేశాడు. అప్పటికే 7 వికెట్లు కోల్పోయి 91 పరుగులు మాత్రమే చేసింది ఆసీస్.

అప్పుడే బ్యాటింగ్ కు వచ్చిన మ్యాక్స్ వెల్ రెచ్చిపోయాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. కమిన్స్ తో కలిసి మ్యాక్స్ వేల్ 202 పరుగులు చేసి ఆస్ట్రేలియాను సెమీస్ కు పంపించాడు. అసలు మిడిల్ ఆర్డర్ లో వెళ్లి అన్ని పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ ఇప్పటి వరకు లేరు. ఆ ఆర్డర్ లో వచ్చి అన్ని పరుగులు చేయడం అనేది రికార్డు అనే చెప్పుకోవాలి. అంతే కాదు.. డబుల్ సెంచరీ చేసిన ఫస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక.. ఆస్ట్రేలియా జట్టు నుంచి డబుల్ సెంచరీ చేసి మ్యాక్స్ వెల్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు.

AFG VS AUS : మనిషివా.. మ్యాక్స్ వెల్ వా అంటూ కామెంట్లు చేస్తున్న జనాలు

ఇక.. మ్యాక్స్ వెల్ పర్ ఫార్మెన్స్ చూసి క్రికెట్ అభిమానులకు పిచ్చెక్కుతోంది. మామూలుగా కాదు. అసలు నీ బ్యాటింగ్ ఏంటి. నువ్వేంటి. నువ్వు మనిషివా.. మ్యాక్స్ వెల్ వా అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఒక్కడివే మ్యాచ్ ను ఒంటి చేతితో కాకుండా.. ఒంటి కాలితో గెలిపించావు. నువ్వు తోపుపో అంటూ మనోడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది