India VS Australia : 70/3 వికెట్లు పోగొట్టుకున్న ఆస్ట్రేలియా.. భారత్‌కి ఇదే మంచి చాన్స్.. ఆస్ట్రేలియాను కట్టడి చేస్తున్న భారత్
ప్రధానాంశాలు:
తక్కువ స్కోర్ కే భారత్ పరిమితం
241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదిస్తుందా?
ఆస్ట్రేలియాను కట్టడి చేయగలుగుతున్న భారత్
India VS Australia : అసలు ఎవ్వరూ ఊహించని మ్యాచ్ ఇది. భారత్ 50 ఓవర్లకు కేవలం 240 పరుగులు మాత్రమే చేసింది. ఇది ఒకరకంగా తక్కువ స్కోర్ అనే చెప్పుకోవాలి. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భారత్ తొలి నుంచి అజేయంగా మ్యాచ్ లు గెలుస్తూ వచ్చింది. కొన్ని మ్యాచ్ లలో 300 పైగా స్కోర్ చేసింది. కానీ.. ఫైనల్ మ్యాచ్ లో మాత్రం కేవలం 240 పరుగులు మాత్రమే చేసి ఆస్ట్రేలియాకు 241 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. అయితే.. తక్కువ స్కోర్ అయినా కూడా దాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కూడా ఆదిలోనే తప్పటడుగు వేసింది. 10 ఓవర్లు కూడా పూర్తి కాకముందే మూడు వికెట్లను పోగొట్టుకుంది ఆస్ట్రేలియా. 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.
ఆస్ట్రేలియా ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ 3 బంతుల్లో 7 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 15 బంతుల్లో 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సీవెన్ స్మిత్ 9 బంతుల్లో 4 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్, మార్నస్ ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా ముందు బ్యాటింగ్ చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
LBW!
And Jasprit Bumrah has another ????????
Steve Smith departs and Australia are 3 down!
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#TeamIndia | #CWC23 | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/LrrYpqs0UR
— BCCI (@BCCI) November 19, 2023
???? Milestone Alert ????
1⃣7⃣ dismissals as a wicketkeeper & counting! ???? ????
KL Rahul now holds the record for the Most Dismissals in a World Cup edition for #TeamIndia as a wicketkeeper ????
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt #CWC23 | #MenInBlue | #INDvAUS | #Final pic.twitter.com/o9kJvozcEF
— BCCI (@BCCI) November 19, 2023