Washington Sundar : వావ్.. వాషింగ్టన్ సుందర్ రూపంలో మరో సూర్యకుమార్ యాదవ్… వీడియో..!
Washington Sundar : ప్రస్తుతం ఇండియా టీంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆతరహాలో క్రేజ్ దక్కించుకున్న ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. ప్రత్యర్థి ఎటువంటి బౌలర్ అయిన 360 డిగ్రీలలో బంతిని బౌండరీలు తలరించడంలో సూర్య కుమార్ యాదవ్ స్టైలే వేరు. ఎలాంటి బంతినైన… చెడుగుడు ఆడేసుకుంటాడు. T20 వరల్డ్ కప్ టోర్నీలో.. సూర్య కుమార్ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే.
చాలామంది సీనియర్ ఆటగాళ్లకు ఉద్వాసన కల్పించిన బీసీసీఐ కుర్ర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 306 పరుగులు చేయడం జరిగింది. టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పాటు వీళ్ళకి తోడు సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక క్లైమేక్స్ లో ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్..పూనకం వచ్చినట్టు వన్డేలో టీ20 స్టైల్‌కు మించిపోయే బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు.
కేవలం 16 బంతులు ఎదుర్కొన్న 3 ఫోర్లు, 3 సిక్సులతో చెలరేగి.. 37 పరుగులతో న్యూజిలాండ్ బౌలర్లను వణికించాడు. సుందర్ ధాటికి 280 వరకు వెళ్తుందనుకున్న టీమిండియా స్కోర్ 306కు చేరుకుంది. చాలా షాట్లు సూర్య కుమార్ యాదవ్ తరహాలోనే వాషింగ్టన్.. చివరి ఓవర్లలో బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. దీంతో వాషింగ్టన్ బ్యాటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల పట్ల చాలామంది క్రికెట్ ప్రేమికులు మరో సూర్య కుమార్ యాదవ్.. వాషింగ్టన్ సుందర్ రూపంలో దొరికాడని.. టీమిండియా బ్యాటింగ్ పరంగా మరింతగా స్ట్రాంగ్ కానుందుని కామెంట్లు చేస్తున్నారు.
Washington Sundar magic with bat. pic.twitter.com/NBlnO0iBvD
— Johns. (@CricCrazyJohns) November 25, 2022