ashwin praises on Virat Kohli
Virat Kohli : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఎన్నో అవరోధాలు, మరెన్నో రివార్డులు అందుకున్నాడు. 2014-15 ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లి..ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అన్ని ఫార్మట్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు సారధ్యం వహించాడు. నెమ్మదిగా ఒక్కొక్క ఫార్మట్ బాధ్యతల్నించి వైదొలిగాడు. అయితే కెప్టెన్సీ నుండి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీపై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి.క్రికెట్‌లో కెప్టెన్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. వారు నెలకొల్పిన రికార్డులు, సాధించిన ఘన విజయాల గురించే మాట్లాడుతుంటారు.
‘ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంకల్లో కోహ్లీ గొప్ప విజయాలు సాధించాడు. భారత క్రికెట్లో కెప్టెన్‌గా అతను నెలకొల్పిన బెంచ్‌మార్క్‌లను కొనసాగించడం ఏ నాయకుడికైనా కష్టమే. విజయాలు అనేవి పంటకు ముందు మనం నాటిన విత్తనాల ఫలితమే. టీమిండియా విజయాల కోసం కోహ్లీ నాణ్యమైన విత్తనాలను నాటాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడని కొనియాడాడు అని రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు.విరాట్ కోహ్లీ నాయకత్వంలో 55 టెస్టులు ఆడిన అశ్విన్ 293 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ సత్తా చాటి మూడు సెంచరీలు నమోదు చేశాడు.
ashwin praises on Virat Kohli
ఇక పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ సైతం కోహ్లీని ప్రశంసించాడు. ‘భవిష్యత్తు తరాలకు నిజమైన నాయకుడు విరాట్ కోహ్లీ. యువ ఆటగాళ్లకు నువ్వు ఆదర్శం. మైదానంలో నీ దూకుడు కొనసాగాలి’ అని ఆమీర్ ట్వీట్ చేశాడు. కాగా, టీమ్ ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ కోసం గతలో ఏ కెప్టెన్ చేయనంత మెరుగ్గా బేసిక్ ప్రిన్సిపల్‌ను ప్రవేశపెట్టాడు. బ్యాటింగ్ లైనప్‌తో పాటు 5గురు ప్రధాన బౌలర్లు ఉండాలనేది విరాట్ కోహ్లి ఆలోచనగా సాగింది. 2015లో శ్రీలంక పర్యటనలో కోహ్లీ ఐదుగురు బౌలర్లను రంగంలో దింపాడు.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.